టీడీపీ బీసీ గర్జనకు జగన్ భయపడ్డారా?

బీసీ గర్జన పేరుతో తెలుగుదేశం పార్టీ నిన్న రాజమహేంద్రవరంలో భారీ బహిరంగసభ పెట్టింది. దీనికి విశేషమైన స్పందన వచ్చింది. గతంలో టీడీపీ పెట్టిన సభలకంటే ఈ సభకు ఎక్కువ స్పందన రావడం విశేషం. పార్టీ పెట్టిన నాటి నుండి బీసీలు టీడీపీకి వెన్నెముకగా ఉన్నారు. దీనితో మరోసారి వారు మద్దతు ఇస్తే టీడీపీకి తిరుగు ఉండదని వైఎస్సార్ కాంగ్రెస్ లో గుబులు మొదలయ్యింది. దీనితో జగన్ మోహన్ రెడ్డి ఉన్నఫళంగా పార్టీలోని బీసీ నాయకులతో సమావేశం అయ్యారు.

పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో నిన్న జరిగిన బీసీ గర్జన గురించే ప్రత్యేకంగా చర్చించినట్టు సమాచారం. చంద్రబాబు బీసీ వర్గాలకు ప్రకటించిన తాయిలాలను సమీక్షించి వాటికి ధీటుగా పార్టీ కూడా ప్రకటించాలని జగన్ నాయకులకు చెప్పారట. ఆయా వర్గాలలో చంద్రబాబు మరోసారి మోసం చెయ్యడానికి సిద్ధం అవుతున్నారని ప్రచారం చెయ్యాలని వారికి దిశానిర్దేశం చేశారు. ఈ లెక్కన టీడీపీ జగన్ ను బానే భయపెట్టింది అనుకోవాలి.