బిగ్ బాస్ 2 ఫైనల్లో వెంకటేష్ దుమ్మురేపాడట!

తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ 2 సీజన్ నేటితో పూర్తి అవుతుంది. వాస్తవానికి వంద రోజులు అని చెప్పినప్పటికీ మరో వారం పొడిగించారు. ఈసారి బిగ్ బాస్ హౌజ్ పదిహేడు మందితో కొనసాగింది. ఇందులో కామన్ మాన్ గా ముగ్గురు ఎంట్రీ ఇచ్చారు. వారిలో సంజన, నూతన్ నాయుడు, గణేష్. అయితే మొదటి వారం సంజన ఎలిమినేట్ కావడం..మరికొద్ది రోజుల్లోనే నూతన్ నాయుడు ఎలిమినేట్ కావడంతో కామన్ మాన్ గా వచ్చిన వారిపై వివక్ష చూపిస్తున్నారని టాక్ వచ్చింది. అయితే గణేష్ మాత్రం దాదాపు డెబ్బైరోజుల వరకు కొనసాగాడు. ఈసారి బిగ్ బాస్ మాత్రం కాస్త విమర్శలతోనే మొదలైంది.

ఈసారి బిగ్ బాస్ సీజన్ 2 హోస్ట్ గా నేచురల్ స్టార్ వ్యవహరిస్తున్నాడు. అయితే నాని హోస్టింగ్ పై కూడా కొత్తలో రక రకాలు విమర్శలు వచ్చాయి. కానీ కొన్ని వారాలు గడిచిన తర్వాత బిగ్ బాస్ టాస్క్ లు, కోపాలు..తాపాలు..కుట్రలు..ఇలా ప్రేక్షకులను అలరిస్తూ వచ్చింది. వీక్ ఎండ్ లో నాని చేసే హంగామా కూడా బాగా ఆకట్టుకుంటూ వచ్చింది. అయితే ఈసారి మాత్రం బిగ్ బాస్ లో కౌశల్ ఆర్మీ అంటూ సోషల్ మీడియాలో దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. కౌశల్ ఆర్మి ఇంటి సభ్యుల ఎలిమినేట్ కావడానికి కూడా కారణం అవుతున్నట్లు రక రకాల రూమర్లు వస్తూనే ఉన్నాయి. అయితే కౌశల్, దీప్తి, గీతా మాధురి, తనీష్, సామ్రాట్ లలో కౌశల్‌కే టైటిల్ గెలిచే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వెలువడుతున్నాయి.

కాకపోతే బయట నిజంగానే కౌశల్ ఆర్మీ చేస్తున్న హడావుడి..2 కె రన్ చేయడం, ర్యాలీలు చేయడం విశేషం. ఈసారి బిగ్ బాస్ సీజన్ 2 హైదరాబాద్ లోనే కొనసాగిస్తున్నారు. దాంతో కొన్ని సార్లు ఎలిమినేట్ అవుతున్న విషయం ఒకరోజు ముందుగానే లీక్ అవుతున్న విషయం తెలిసిందే. నేటితో బిగ్ బాస్ సీజన్-2 ముగియనుంది. నేడు ఫైనల్ ఫినాలే జరుగనుండగా, ఆ ఎపిసోడ్ ను నిన్ననే ‘స్టార్ మా’ యాజమాన్యం చిత్రీకరించగా, షోలో ప్రేక్షకులుగా పాల్గొన్న యువతీ యువకుల నుంచి ఎన్నో లీక్ లు వస్తున్నాయి. ఇలాంటి లీకేజ్ లు జరగకుండా ఎన్ని జాగ్రత్తలు పడుతున్నా లీకేజ్ లు మాత్రం ఆగడం లేదు.

తాజాగా విక్టరీ వెంకటేష్ వచ్చి, బిగ్ బాస్ సీజన్-2 విజేతను స్వయంగా ప్రకటించారని, ఈ సందర్భంగా ఆయన అదిరిపోయే స్పీచ్ ఇచ్చారని సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. తమిళ బిగ్ బాస్ ఫైనల్‌కి టాలీవుడ్ సెన్షేషన్ విజయ్ దేవరకొండ గెస్ట్‌గా హాజరవుతున్నారట. ఇది ఎంత వరకు నిజమో..లేక రూమరో అన్న విషయం ఈ రోజు రాత్రి వరకు తెలిసిపోతుంది. బిగ్ బాస్ విజేతగా నిలిచిన వారికి రూ.50 లక్షల నగదు బహుమతి దక్కనుంది. టైటిల్ గెలిచేది ఎవరనేది మరి కొద్ది గంటల్లో తేలనుంది.