అరవింద సమేత ప్రీరిలీజ్ ఫంక్షన్ లో యాంకర్ గా త్రివిక్రమ్

త్రివిక్రమ్ ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న ‘అరవింద సమేత’ రిలీజ్ డేట్ దగ్గర  పడుతున్న నేపధ్యంలో ఈమూవీకి మరింత క్రేజ్ తీసుకురావడానికి ఈమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను   అక్టోబర్ 2న ప్లాన్ చేస్తున్నట్లు సమసచారం. ఆరోజు గాంధీ జయంతి కావడంతో నేషనల్ హాలీడే కూడ కలిసి రావడంతో ఈమూవీ ప్రీరిలీజ్ ఫంక్షన్ లైవ్ కవరేజ్ టీవీలలో బాగా చూస్తారని ఆ డేట్ ఫిక్స్ చేసిన్నట్లు సమాచారం.

హైదరాబాద్ లోని హెచ్ఐసిసి లో జరిగే ఈఫంక్షన్ ను చాలా భారీగా చేయాలని ప్లానింగ్ చేస్తున్నారు. ఈమధ్యకాలంలో ‘భరత్ అనే నేను’ ‘అజ్ఞాతవాసి’ ఫంక్షన్ లు చాలా భారీగా జరిగిన నేపధ్యంలో ఆ ఫంక్షన్స్ స్థాయి మించి నిర్వహించి జూనియర్ స్టామినాను చాటాలని ఆలోచనలు చేస్తున్నట్లు టాక్. అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ ఫంక్షన్ లో సంథింగ్ స్పెషల్ ఉంటుంది అని తెలుస్తోంది.

సాధారణంగా సినిమా ఫంక్షన్లకు యాంకర్ గా సుమ లాంటి  టాప్ యాంకర్ ను పిలవడం పరిపాటి. టాప్ హీరోల సినిమాల ఫంక్షన్స్ అంటే ఆ ఫంక్షన్స్ కు సుమ యాంకరింగ్ ఒక ప్రత్యేక ఆకర్షణ. అయితే ‘అరవింద సమేత’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను యాంకర్ లేకుండా ఒకవేళ యాంకర్ ఉన్నా చాల తక్కువ ప్రాధాన్యత ఉండేలా చూసి ఈమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను అంతా త్రివిక్రమ్ మాటల మాయతో నిర్వహించాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

వాస్తవానికి సినిమా ఫంక్షన్ లో త్రివిక్రమ్ కు వివరంగా మాట్లాడే అలవాటుంది. దీనితో ‘అరవింద సనేత’ ఫంక్షన్ కాస్త యాక్టివ్ రోల్ తీసుకుంటే బాగుంటుందని త్రివిక్రమ్ కు సన్నిహితులు సలహా ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ ఎలాగూ హుషారుగానే ఉంటాడు కాబట్టి త్రివిక్రమ్ జూనియర్ లు వేదిక పై చేసే సందడి చూడాలి అంటే ‘అరవింద సమేత’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ వరకు అభిమానులు ఎదురు చూడవలసిందే..