ఎన్టీఆర్-రాంచరణ్ మల్టీస్టారర్ ధీటుగా త్రివిక్రమ్-అల్లు అర్జున్ మల్టీస్టారర్

trivikram-and-bunny-multistarrer

మల్టీస్టారర్ ట్రెండ్ కొనసాగుతున్న టాలీవుడ్ లో మరో క్రేజీ మల్టీస్టారర్ షురూ అవబోతుందని ఫిల్మ్ నగర్ టాక్. బాహుబలి తర్వాత రాజమౌళి కూడా ఆ అంచనాలను అందుకోవాలి అంటే మల్టీస్టారర్ పర్ఫెక్ట్ అని చరణ్, ఎన్.టి.ఆర్ లతో ట్రిపుల్ ఆర్ ప్రాజెక్ట్ కు ఫిక్స్ అయ్యాడు. అందుకే ఇప్పుడు టాలీవుడ్ టాప్ డైరక్టర్ లలో ఒకరైన త్రివిక్రం కూడా మెగా మల్టీస్టారర్ కు ప్లాన్ చేశాడట.

మెగా మల్టీస్టారర్ అంటే కేవలం మెగా హీరోలనే కాదు.. అరవింద సమేత సినిమా తర్వాత త్రివిక్రం ఖాళీగానే ఉంటాడు. వెంకటేష్ తో ఆల్రెడీ ఓ సినిమా చేయాల్సి ఉంది. అటు అల్లు అర్జున్ కూడా త్రివిక్రం కోసం వెయిటింగ్. అందుకే ఈ ఇద్దరిని కలిపి ఓ మల్టీస్టారర్ మూవీ చేసేందుకు రంగ సిద్ధం చేస్తున్నాడు త్రివిక్రం.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వారు వెంకీ సినిమాకు ఆలెడీ అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారు. ఈమధ్యనే మల్టీస్టారర్ కథ కూడా వెంకటేష్ కు చెప్పిన త్రివిక్రం ఆయన దగ్గర నుండి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నాడట. ఇక బన్నికి చెప్పి ఒప్పించాల్సి ఉంది. త్రివిక్రం తో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు చేసిన బన్ని కచ్చితంగా ఈ మల్టీస్టారర్ కు ఒప్పుకునే అవకాశం ఉంది.

అంతేకాదు చరణ్, ఎన్.టి.ఆర్ లకు ధీటుగా ఈ మల్టీస్టారర్ ఉండేలా తెరకెక్కించే అవకాశం ఉంటుంది. వెంకటేష్ ఎలాగు సీనియర్ హీరో కాబట్టి ఫోకస్ అంతా తన మీద ఉండేలా బన్ని మెగా స్కెచ్ వేస్తున్నాడు. మరి ఈ మల్టీస్టారర్ షురూ అయితే కనుక క్రేజీ మూవీ చూసే అదృష్టం తెలుగు ప్రేక్షకులకు కలిగినట్టే. ఈ ప్రాజెక్ట్ కు సంబందించిన మిగతా డీటైల్స్ తెలియాల్సి ఉంది.