మారిన జీవనశైలి కారణంగా ప్రతి ఒక్కరు ఒత్తిడి తగ్గించుకోవటానికి కామెడీ కార్యక్రమాలను చూస్తూ రిలాక్స్ అవుతున్నారు. అందుకే ఛానల్స్ వారు కూడా కామెడీ కార్యక్రమాలకు పెద్ద పీట వేస్తున్నారు. స్టార్ మాలో బ్రహ్మానందం ఆధ్వర్యంలో “Laughter Challenge Show” అంటూ ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ కార్యక్రమంలో బ్రహ్మానందంతో పాటు టాలీవుడ్ హీరోయిన్ తేజస్విని యాంకరింగ్ చేస్తుంది.
పదహారణాల తెలుగు అమ్మాయి అయినా తేజు ఈ షో ద్వారా యాంకరింగ్ లోకి ఎంటర్ అవుతుంది. మొదట్లో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు, స్టార్ సినిమాల్లో కూడా చిన్న పాత్రలు చేసింది. ఈ మధ్య ఒక రియాల్టీ షో లో పాల్గొని మరల ఫామ్ లోకి వచ్చింది. ప్రస్తుతం చేస్తున్న షో కి ఒక్కో ఎపిసోడ్ కి దాదాపుగా 50 వేలు తీసుకుంటుందట. ఏది ఏమైనా ఈ షో తో తేజు మరో మెట్టు ఎక్కుతుందని చెప్పవచ్చు.
Follow @THEPANIPURI