అవినీతి అధికారి జనసేనలో చేరిక, వెంటనే పదవి

tamil-nadu-ex-govt-member-into-janasena

తమిళనాడు మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్ మోహన్ రావు కాసేపటి క్రితం జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. చేరిన వెంటనే ఆయనను పార్టీ పొలిటికల్ అడ్వైజర్ గా నియమించారు పవన్ కల్యాణ్. అయితే ఈ చేరిక నియామకం పై ఇప్పుడు వివాదం చెలరేగుతుంది. 2016లో ఆయన తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉండగా ఆయన మీద అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఇసుక మాఫియాతో సంబంధం ఉందని ఆరోపణలు వచ్చాయి ఆ తరువాత ఆయన మీద ఐటీ దాడులు జరిగాయి.

ఆ తరువాత ఆయనను తమిళనాడు ప్రభుత్వం తప్పించింది. ఇప్పటికీ ఆయన మీద ఆ కేసులు నడుస్తున్నాయి. ఆ తరువాత ప్రభుత్వ పెద్దలను ఎలాగో ప్రసన్నం చేసుకుని పోస్టింగు తెచ్చుకున్నారు. ఇంతటి వివాదాస్పద అధికారిని పార్టీలోకి తీసుకుని వచ్చిన వెంటనే పదవి ఇవ్వడం వివాదంగా మారింది. మార్పు తెస్తాం సరికొత్త రాజకీయాలు చేస్తాం అంటూ మాట్లాడి పవన్ కల్యాణ్ చేసే రాజకీయం ఇదా అని పలువురు అంటున్నారు.