మల్టీస్టారర్ అంటే వణికిపోతున్న స్టార్ హీరో..!

star-hero-not-interested-in-multi-starrers

టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ మల్టీస్టారర్.. ఒక హీరోతోనే రికార్డులు కొడుతున్న సినిమాలు ఇప్పుడు ఇద్దరు హీరోలు చేస్తే ఇంకా మరిన్ని సంచలనాలు సృష్టించవచ్చు. ప్రస్తుతం సెట్స్ మీద దాదాపు మూడు నాలుగు మల్టీస్టారర్ సినిమాలు ఉన్నాయి. ఇదిలాఉంటే ఓ స్టార్ హీరో మాత్రం మల్టీస్టారర్ అంటే చాలు ఆమడదూరం వెళ్తున్నాడట.

పరిశ్రమలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన సదరు హీరో ఈమధ్య వరుస హిట్లతో ఆకట్టుకున్నాడు. అయితే ఈ ఇయర్ ఓ సోలో సినిమా, ఓ మల్టీస్టారర్ సినిమా చేయగా రెండు నిరాశ పరచాయి. ప్రస్తుతం సెట్స్ మీద ఓ ప్రయోగాత్మక సినిమా ఉండగా ఈమధ్య ఓ దర్శకుడు ఆ హీరోకి మల్టీస్టారర్ కథ వినిపించడానికి వెళ్లాడట.

సారీ బాబాయ్.. మల్టీస్టారర్ అయితే చేయనని మొహం మీదే చెప్పేశాడట. మల్టీస్టారర్ కథ రాసుకున్నప్పుడు బాగానే ఉంటుంది కాని తెర మీద సరిగా కుదరదని ఇదవరకు వచ్చిన మల్టీస్టారర్ అనుభూతిని చెప్పాడట. సీనియర్ స్టార్ తో మల్టీస్టారర్ చేయడం తప్పేనని ఒప్పుకున్నాడు ఆ హీరో.

చూస్తుంటే ఆ మల్టీస్టారర్ వల్ల ఆ హీరో చాలా ఇబ్బందులు పడ్డట్టు ఉన్నాడు. క్రేజీ మల్టీస్టారర్ గా వచ్చిన ఆ సినిమా కాస్త తుస్సుమనగా హీరో గారి ఇమేజ్ కాస్త డ్యామేజ్ అయ్యింది. లాస్ట్ ఇయర్ వరకు మంచి ఫాం లో ఉన్న అతను మళ్లీ హిట్ కోసం తాపత్రయ పడుతున్నాడు. మరోపక్క అతనికి పోటీగా మరో స్టార్ వరుస హిట్లు కొడుతూ అతన్ని మించేలా కనిపిస్తున్నాడు. మరి ఇంతకీ మల్టీస్టారర్ వద్దనుకునే ఆ హీరో ఎవరో మీరు గెస్ చేశారా..?

News Journalist at Panipuri and Film Reviewer. Indian movies box office tracker.