స్టార్ హీరో కోరికలు తీర్చలేక సినిమా ను వదులుకున్న … నిత్యామీనన్ సంచలనం…!

star-hero-harassed-me-nithya-menon

మీ టూ  ఉద్యమం చల్లారుతుందనుకునే లోపే మళ్ళీ హీట్ ఎక్కుతుంది. హీరోయిన్స్ తమ కు జరిగిన చేదు అనుభవాలను మీడియా ద్వారా పంచుకుంటున్నారు. ఇప్పటికే పలువురు స్టార్ హీరోయిన్స్ ఇండస్ట్రీలో జరుగుతున్న చీకటి కోణాలను బయటపెడుతున్నారు. అయితే ఇదే బాటలో నిత్యా మీనన్ కూడా స్పందించడం హాట్ టాపిక్ అయ్యింది. ఓ స్టార్ హీరోతో ఓ భారీ ప్రాజెక్టు సినిమాను వదులుకున్నట్టు మలయాళ బొద్దుగుమ్మ నిత్యా మీనన్ వెల్లడించింది. దీనికి కారణం ఆ స్టార్ హీరో గొంతెమ్మ కోర్కెలు తీర్చలేక వదులుకున్నట్టు చెప్పుకొచ్చింది.

ఇదే అంశంపై ఆమె తాజాగా మాట్లాడుతూ, తనకు ఓ హీరో నుంచి లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. ఈ కారణంగానే అతనితో ఓ సినిమా వదులుకున్నట్టు చెప్పింది. అయితే, ఆ సినిమా పేరును మాత్రం ఆమె వెల్లడించలేదు. అయితే, అలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు తాను సినిమాలు వదలుకోడానికి సంకోచించనని నిత్యా తెలిపారు. సినిమా అంగీకరించడానికి ముందుగానే అలాంటి విషయాల్లో జాగ్రత్తపడతానని చెప్పింది.

‘ఇందుకు నేను కొన్ని పద్ధతులను పాటిస్తాను. లైంగిక వేధింపులు వంటి పరిస్థితి ఏర్పడకుండా ఉండాలంటే మన వర్కింగ్ స్టైల్‌తోనే బలమైన మెసేజ్ ఇవ్వాలి. దీనివల్ల మనతో తప్పుగా ప్రవర్తించడం, లేదా తప్పుడు ఉద్దేశంతో అవకాశాలు ఇస్తామనడం వంటివి ఉండవు’ అని ఆమె తెలిపారు. దీనితో సినీ ఇండస్ట్రీలో ప్రతి స్టార్ హీరోయిన్ ఇటువంటి చేదు అనుభవాలను ఎదుర్కొందని అర్ధం అవుతుంది.

News Journalist at Panipuri and Film Reviewer. Indian movies box office tracker.