సవ్యసాచి రిలీజ్ కి ముందు భారీ మార్పు !

సవ్యసాచి-రిలీజ్-కి-ముందు

నాగచైతన్య ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘సవ్యసాచి’ రిజల్ట్ మరోక్కరోజులో తేలబోతోంది. చైతూ కెరియర్ లో ఇప్పటి వరకు ఏసినిమాకు జరగనంత స్థాయిలో ఈమూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. దీనితో చైతన్య మార్కెట్ స్టామినాకు ‘సవ్యసాచి’ కలక్షన్స్ పరీక్షగా మారబోతోంది. ఇలాంటి పరిస్థుతులలో ‘సవ్యసాచి’ మూవీలో ఒక ఊహించని ట్విస్ట్ ఉంది అని కూడ ప్రచారం జరుగుతోంది.

ఇప్పటి దాకా ఈమూవీకి చేసిన ప్రమోషన్ లో లవ్ ట్రాక్ తో పాటు మంచి సీరియస్ నెస్ తో కూడిన హీరో-విలన్ డ్రామాను హై లైట్ చేసారు. దీనితో సహజంగానే ‘సవ్యసాచి’ లో ఎంటర్ టైన్మెంట్ డోస్ తక్కువగా ఉంటుందా అన్న అనుమానాలు ఏర్పడ్డాయి. అయితే ఈమూవీలో చాలామంచి హ్యూమర్ ట్రాక్ కూడ ఉంది అన్న వార్తలు వస్తున్నాయి.

తెలుస్తున్న సమాచారంమేరకు దర్శకుడు చందు మొండేటి ఈమూవీ సెన్సార్ కు వెళ్ళే ముందు హడావిడిగా నాగచైతన్య వెన్నెల కిషోర్ ల మధ్య ఒక కామిడీ ట్రాక్ ను షూట్ చేసినట్లు టాక్. ముఖ్యంగా నాగచైతన్య అర్జునుడిగా అతనికి గీత బోధ చేసే కృష్ణుడిగా వెన్నెల కిషోర్ ల మధ్య వచ్చే ట్రాక్ ఈమూవీని చూస్తున్న వారికి విపరీతమైన నవ్వును తెప్పిస్తుందని సమాచారం.

ఈమూవీకి మరింత క్రేజ్ ను తీసుకు రావడానికి చైతు వెన్నెల కిషోర్ ల మధ్య ఈ కామెడీ ట్రాక్ కు సంబంధించిన స్టిల్స్ చిన్న మేకింగ్ వీడియో ఇవాళ రాత్రిలోపు విడుదల చేస్తారని వార్తలు వస్తున్నాయి. ‘అరవింద సమేత’ తరువాత విడుదలైన ఏసినిమా ప్రేక్షకులను ప్రభావితం చేయలేకపోయిన నేపధ్యంలో ‘సవ్యసాచి’ ఉన్న అంచనాలు ఎంతవరకు నిజం అవుతాయో రేపు తేలిపోతుంది..

News Journalist at Panipuri and Film Reviewer. Indian movies box office tracker.