సమంత స్టాఫ్ చైతన్య ని అవమానిస్తున్నారు అంట

Exclusive:Samantha Took Over Naga Chaitanya's Career?

‘మజిలీ’ సక్సస్ ను ఎంజాయ్ చేస్తూ ఈమధ్యనే విదేశాలకు వెళ్లి వచ్చిన నాగచైతన్య సమంతలు తిరిగి వారివారి సినిమాల షూటింగ్ విషయమై దృష్టి పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో చైతూకు సమంత వ్యక్తిగత స్టాఫ్ పై కోపం వచ్చింది అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. చైతు సమంతల మధ్య ఎప్పుడు లేని ఇగో సమస్య వారి వద్ద పనిచేసే వ్యక్తిగత స్టాఫ్ వల్ల ఏర్పడింది అంటూ ఇండస్ట్రీలో వస్తున్న ఈ గాసిప్పులలో నిజాలు ఎన్నో తెలియకపోయినా ఈ వార్తలు మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

తెలుస్తున్న సమాచారం మేరకు సమంతకు అదేవిధంగా నాగచైతన్యకు ప్రత్యేకంగా స్టాఫ్ ఉన్నారు. డ్రస్సింగ్‌ హెయిర్ స్టైలింగ్‌ మేకప్ ఇలా ప్రతిపనికీ వీరిద్దరూ తమ వద్ద పనిచేయడానికి వేరువేరు స్టాఫ్ ను నియమించుకున్నారు. అయితే సమస్య ఇక్కడే మొదలైంది అని తెలుస్తోంది.

సమంత తన స్టాఫ్ ను చాల బాగా చూసుకుంటుంది వారి వ్యక్తిగత అవసరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సమంత నటించిన సినిమాలు హిట్ అయితే వారికి ఖరీదైన బహుమానాలు ఇవ్వడం పార్టీలు ఇవ్వడం లాంటి విషయాలు చేస్తూ తన వ్యక్తిగత స్టాఫ్ లో జోష్ ను నింపుతూ ఉంటుంది. దీనితో సమంత అంటే ఆమె వ్యక్తిగత సిబ్బంది ఎంతో అభిమానంగా పని చేస్తారని టాక్.

అయితే ఈవిషయంలో నాగచైతన్య సమంత అంత ఉదారంగా తన వ్యక్తిగత స్టాఫ్ పట్ల ఉండడని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితులలో లేటెస్ట్ గా విడుదలై మంచి విజయం సాధించిన ‘మజిలీ’ సినిమా గురించి సమంతా చైతన్యాల వ్యక్తిగత సిబ్బంది మధ్య చిన్న భేదాభిప్రాయాలు వచ్చినట్లు టాక్. ఈసినిమాలో సమంత బాగా నటించిందా లేకుంటే చైతన్య బాగా నటించాడా అన్న విషయమై సమంతా చైతన్యల వ్యక్తిగత స్టాఫ్ మధ్య అనవసరపు చర్చలు జరిగినట్లు టాక్. ఈమాటలు ఆ స్టాఫ్ మధ్య శ్రుతిమించడంతో ఏర్పడిన చిన్నపాటి రగడ నాగచైతన్య దృష్టి వరకు వెళ్ళినట్లు సమాచారం. దీనితో కోపం తెచ్చుకున్న చైతూ సమంత స్టాఫ్ పై అసహనంతో అలిగాడని ఈవిషయాన్ని తెలుసుకున్న సమంత ఈ అనవసరపు వివాదం పై తల పట్టుకుందనీ ఇండస్ట్రీ వర్గాలలో గసిప్పులు హల్ చల్ చేస్తున్నాయి..

Comments

comments