‘సాహూ’ యాక్షన్ సీన్స్ లీక్..!

టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఏ హీరోకి రాని క్రేజ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి వచ్చింది. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో చత్రపతి తర్వాత బాహుబలి లాంటి ప్రతిష్టాత్మక సినిమాలో నటించిన ప్రభాస్ తన ఐదు సంవత్సరాల కష్టానికి ఎంతో గొప్ప పేరు లభించింది. ప్రస్తుతం ప్రభాస్ జాతీయ స్థాయి నటుడిగా గుర్తింపు ఉండటంతో ఆయన తదుపరి సినిమాలపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో ‘సాహూ’సినిమాలో నటిస్తున్నాడు ప్రభాస్.

ఈ సినిమాలో బాలీవుడ్ బ్యాటీ శ్రద్దా కపూర్ నటిస్తుంది. అంతే ఈ సినిమాలో కీలకపాత్రల్లో బాలీవుడ్ నటులు నటిస్తున్నారు. ఈ సినిమాను యువి క్రియేషన్స్ వారు 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. హాలీవుడ్ సినిమాలకు ధీటుగా ఉండేలా ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ఉన్నాయని తెలుస్తుంది. ఈ మద్య స్టార్ హీరోలు నటిస్తున్న సినిమాలకు సంబంధించి లీకేజీల బెడద ఎక్కువ అవుతున్న విషయం తెలిసిందే.

సెట్స్ పై ఉన్న సినిమా షూటింగ్ లకు సంబంధించి ఫోటోలు లీక్ కావడంతో తమ హీరో ఇలా ఉండబోతున్నారా అని ఫ్యాన్స్ అప్పుడే రక రకాలుగా ఊహించుకోవడం జరుగుతుంది. దర్శక, నిర్మాతలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఈ లీకేజీలు మాత్రం ఆగడం లేదు. సాహూ సినిమా నుండి ఓ యాక్షన్ వీడియో లీక్ అయ్యింది. ప్రభాస్ బైక్ మీద బుల్లెట్ వేగంతో దూసుకెళ్తున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అబుదాబిలోని ఓ యాక్షన్ సీన్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని తెలుస్తుంది. అయితే సినిమా షూటింగ్ దశలో ఉన్నందున ఇలాంటి లీకేజీలు మూవీపై ఎలాంటి ప్రభావం చూపించబోవని దర్శక, నిర్మాతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.శంకర్ ఎహసన్ లాయ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఈ ఇయర్ ఆగష్టు 15న రిలీజ్ ఫిక్స్ చేశారు.

Comments

comments