నూతన్ నాయుడు నిన్న బిగ్ బాస్ కి రాకపోవటానికి కారణం

reason-for-nutan-naidu-not-attending-bigg-boss

చివరి అంకం చేరిన బిగ్ బాస్ సీజన్ 2 మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఇక విజేత ఎవరో తేల్చే ఘడియలు రాబోతున్నాయి. దీంతో మొత్తం కంటెస్టెంట్స్ అందరినీ గ్రాండ్ ఫినాలేకి ఆహ్వానించారు. వైల్డ్ కార్డు ఎంట్రీతో కలిపి సీజన్ టు 18మంది కంటెస్టెంట్స్ ఉండగా సీజన్ టు గ్రాండ్ ఫినాలే కి 17మంది చేరుకోవడంతో రంజుగా ఉంది. అయితే విచిత్రంగా నూతన్ నాయుడు హాజరుకాలేదు. వాస్తవానికి నూతన్ రెండు సార్లు బయటకు వచ్చి, రెండుసార్లు లోపలకు ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్ ఎవరైనా ఉంటే అది నూతన్ ఒక్కడే. ఇక గ్రాండ్ ఫినాలేకి కౌశల్,దీప్తి,గీతా మాధురి,తనీష్,సామ్రాట్ ఈ ఐదుగురు మాత్రమే మిగిలారు.

ఇక గతంలో ఒక్కొక్కరు ఎలిమినేట్ అయ్యారు కదా. అందులో అమిత్,శ్యామల,నందిని, కిరీటి దామరాజు, దీప్తి సునయన,తేజస్వి మదివాడ, సంజన,నందినీ రే,బాబు గోగినేని,భానుశ్రీ, పూజ రామచంద్రన్ ఇలా అందరూ హౌస్ లో శుక్రవారం సందడి చేసారు. ఇక నూతన్ రాకపోవడంతో పెద్ద చర్చ నడిచింది. అయితే తాను ఎందుకు రావట్లేదో తెలుపుతూ నూతన్ బహిరంగ లేఖ విడుదల చేయడం అందరికీ షాకిచ్చింది.

ప్రియమైన ప్రజానీకానికి కృతజ్ఞతాభివందనాలు అంటూ లేఖను స్టార్ట్ చేసిన నూతన్ హౌస్ లో కొన్ని అంశాలను లేవనెత్తాడు.’ హౌస్ లోకి వెళ్లి బయటకు వచ్చేయడం వరకూ అందరూ నాపై చూపిన అభిమానికి కృతజ్ఞతలు. లక్షలాది అభిమానులను సంపాదించుకోవడం నా అదృష్టం. నేను బయటకు రావడంపై పలువురు పోస్టులు పెడుతూ విచారం వ్యక్తంచేస్తున్నారు.

నాకు కోట్లలో ఓట్లు వచ్చినా సరే, బిగ్ బాస్ కావాలని వాటిని పరిగణనలోకి తీసుకోకుండా పక్షపాతంతో వ్యవహరించాడని చాలామంది నాకు చెప్పారు. అయితే దీనిపై నేను వ్యాఖ్య చేయదలచుకోలేదు. రాజకీయాల్లో అయినా , బిగ్ బాస్ లో అయినా ప్రజాతీర్పు శిరోధార్యం. కానీ బిగ్ బాస్ లో అలా జరుగుతున్నట్లు ప్రజలకు అనిపించడం లేదు.

అంటే ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతోందన్నమాట. ఏదైనా జరగొచ్చు అనే ట్యాగ్ ఉన్నాసరే, ప్రజాభిప్రాయాన్ని ప్రతిబించేలా ఉండాలన్న మూల సూత్రాన్ని బిగ్ బాస్ మరిచిపోకూడదు. నాకు సహకరించిన బిగ్ బాస్ కి స్టార్ మా యాజమాన్యానికి,ఆడియన్స్ కి, అభిమానులకు ,అందరికీ కృతజ్ఞతలు’అంటూ లేఖ ముగించారు.