రష్మిక మహేష్ కి నో చెప్పి,బన్నీ కి ఓకే చెప్పటానికి కారణం

ప్రస్తుతం టాలీవుడ్ లో జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్న క్రేజీ భామ రష్మిక మందన. చలో సినిమాతో ఎంట్రీ ఇచ్చి, గీతాగోవిందంతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయిన ఈ భామని ఇప్పుడు యువ హీరోలు ఫస్ట్ ఛాయస్ గా చూస్తున్నారు. ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమాలో మరోసారి విజయ్ దేవరకొండతో జోడీ కడుతుంది. డైరెక్టర్ అనిల్ రావిపూడి-సూపర్ స్టార్ మహేశ్ తో చేస్తున్న సినిమాలో హీరోయిన్ గా ముందు రష్మికని తీసుకోవాలని అనుకున్న ఆమె స్టొరీ విని నో చెప్పింది..

మరో పక్క అల్లు అర్జున్ తో సినిమాకి రష్మిక ఓకే చెప్పింది. అయితే.. ఈ సినిమా కోసమే మహేష్ బాబు-అనిల్ రావిపూడి కాంబినేషన్ సినిమాను వదులుకొంది రష్మిక మండన్న. బేసిగ్గా.. అల్లు అర్జున్ కంటే పెద్ద హీరో అయిన మహేష్ బాబు సినిమాను వదులుకోవడానికి ఏ హీరోయినూ ఇష్టపడదు. కానీ.. అనిల్ రావిపూడి సినిమాలో హీరోయిన్ కంటే సుకుమార్ సినిమాలో హీరోయిన్ కి కథలో ప్రాముఖ్యతతోపాటు ప్రాధాన్యత కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని బాగా ఆలోచించిన రష్మిక కావాలనే మహేష్ బాబు సినిమా వదిలేసుకుని.. అల్లు అర్జున్ సినిమా సైన్ చేసిందని తెలుస్తోంది.

Comments

comments