ప్రభాస్ తదుపరి చిత్రం,మలయాళ ఫ్రీమేక్

prabhas-next-movie-is-a-malayalam-freemake

“సాహో” షూటింగ్ తో బిజీగా ఉన్న ప్రభాస్ ఆ సినిమా షూటింగ్ ఇంకా పూర్తీ కాకముందే తన తదుపరి సినిమా షూటింగ్ ని స్టార్ట్ చేసాడు. రాధా కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా అక్టోబర్ 6 నుంచి షూటింగ్ కి వెళ్లనుంది. ఈ సినిమా సగం షూటింగ్ ఇటలీ లో జరుగనుంది. అయితే ఈ సినిమా లో ప్రభాస్ ఫ్యూచర్ కి వెళ్లి అక్కడ ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో చూసి మళ్ళి అక్కడ నుంచి గతంలోకి వచ్చి ఆ ప్రమాదం జరగకుండా అందరిని కాపాడతాడట.

అచ్చంగా ఇదే కాదు కానీ ఈ థీమ్ తో 1991లో “అయ్యర్ ది గ్రేట్” అని మమ్ముట్టి హీరోగా మలయాళం ఓ సినిమా వచ్చింది. ఇదే సినిమాని తెలుగు లో “సూర్య ది గ్రేట్” పేరుతో తెలుగులో కూడా డబ్ చేసారు. జరగబోయే ప్రమాదాలు సంఘటనలు ముందే ఊహించే శక్తి ఉన్న మమ్ముట్టి ఓ విమానాన్ని ప్రమాదం నుంచి కాపాడతాడు. పిల్లల ఆరోగ్యంతో ఆడుకుంటున్న విలన్ల భరతం కూడా ఇదే తరహాలో పడతాడు. ఇక్కడ కూడా ప్రభాస్ ఇదే తరహాలో పోరాడతాడు అని తెలుస్తుంది. యువి క్రియేషన్స్ పై వంశీ ప్రమోద్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు.