తరుణ్,ఉదయకిరణ్ ఇంతకంటే పెద్ద హిట్లు కొట్టారు.రౌడీ హీరోకి సలహా ఇస్తున్న ప్రజలు

people-giving-suggestion-to-rowdy-hero

కెరీర్ మొత్తం లో సరిగ్గా మూడు హిట్లు లేవు, కాని క్రేజ్ అనుకున్న దానికంటే ఎక్కువే వచ్చింది. అతడ్ని ”యూత్ ఐకాన్” అని,రౌడీ హీరో అని
ఎవరు అన్నారో తెలీదు కానీ ఓ వర్గం మీడియా మాత్రం అతడ్ని యూత్ ఐకాన్ అని సంబోదిస్తుంది. అయితే ఇలాంటి హైప్ చూసి సదరు హీరోకి తనకు తాను ఇండియా లోనే స్టార్ హీరో అన్న రేంజ్ లో బిల్డుప్ ఇస్తున్నాడు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం, అదే స్టైల్ అనుకోవడం, తానేదో యూత్ మొత్తాన్ని ఉద్దరించేసినట్లు బిల్డప్ కొట్టడం ఆ హీరోలో స్పష్టంగా కనిపిస్తుంది.

ఇలాంటి యంగ్ హీరోలను టాలీవుడ్ చాలా మందిని చూసింది. తరుణ్,ఉదయ్ కిరణ్ ఇలాంటి హీరోలు వాళ్ళు ఫామ్ లో వున్నప్పుడు ఇంతకంటేపెద్ద హిట్లు కొట్టారు. ఆ తరువాత వాళ్ళు ఎక్కడ వున్నారో తెలిసిందే. అసలైన హీరోయిజం హిట్లు కొట్టినప్పుడు కాదు.. వరుసగా పది ఫ్లాపులు పడినా మళ్ళీ సినిమా వస్తుంది అంటే ప్రేక్షకులు మొదటి ఆటకే క్యూలో నిలబడాలి. అదీ హీరోయిజం. ఈ కుర్ర హీరోకి ఇంకా ఎలాంటి ప్రతికూల పరిస్థితి ఎదురుకాలేదు. కానీ మీడియా బాగా ఎత్తేయడం వల్ల కళ్ళు నెత్తికెక్కిపోయాయి. నిజంగానే తానేదో ఉద్దరించేస్తునట్లు ఫోజులు కొట్టి తెగ బిల్దఫ్ ఇస్తున్నాడు. మీడియా ఇచ్చిన యూత్ ఐకాన్ టైటిల్ ని నిజంగా జనాలు ఇచ్చినట్లే ఫీలైపోతున్నాడు. ఇలా ఉంటే ఆ రౌడీ హీరోకి ఫ్యూచర్ లో ఇబ్బందులు తప్పవు.