సంచలం సృష్టిస్తున్న పవన్ రహస్య పూజలు

పవన్ కళ్యాణ్ ఈరోజు తెల్లవారుజామున పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల వద్ద ఉన్న జగన్నాధపురం గ్రామంలోని నరసింహ స్వామి ఆలయంలో కొన్ని రహస్య పూజలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈపూజలు జరుగుతున్నంత సేపు ఈఆలయంలోకి ఎవర్ని అనుమతించలేదని గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి.

వాస్తవానికి సుమారు పది సంవత్సరాల క్రితం ఇదే ఆలయంలో పవన్ తన ‘జల్సా’ విడుదలకు ముందు కొన్ని పూజలు చేసిన తరువాత ఆమూవీ అప్పట్లో సూపర్ హిట్ అయిన నేపధ్యంలో పవన్ కు సెంటిమెంట్ గా ఈ ఆలయ మహత్యం పై బాగా నమ్మకం అని టాక్. ప్రస్తుతం రోజురోజుకు రాజకీయాలలో పవన్ మ్యానియా బాగా తగ్గిపోతున్న నేపధ్యంలో మళ్ళీ తనకు అప్పటి ప్రాభవం లభించాలి అన్న ఉద్దేశ్యంతో పవన్ తన వ్యక్తిగత జ్యోతిష్కుల సలహాతో ఈరోజు ఈపూజలు చేసినట్లు సమాచారం.

వాస్తవానికి ప్రస్తుతం పవన్ అనుసరిస్తున్న రాజకీయ వ్యూహాలు అన్నీ పూర్తి అయోమయంతో కొనసాగుతున్న నేపధ్యంలో చాలామంది ‘జనసేన’ వర్గాలు కూడ పవన్ తీరు పై బయటకు వ్యక్తం చేయలేని అసహనంలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికితోడు ప్రముఖ జాతీయ మీడియా సంస్థ కూడ రానున్న ఎన్నికలలో పవన్ కు 5శాతం నుండి 8 శాతం మించి ఓట్లు రావు అని లెక్కలు వేసి చెపుతున్న నేపధ్యంలో కనీసం వచ్చే ఎన్నికల్లో పవన్ ‘జనసేన’ కు 10 సీట్లు అయినా వస్తాయా అన్న అనుమానాలు రాజకీయ విశ్లేషకులు వ్యక్త పరుస్తున్నారు.

అయితే ఈవిషయాలు ఏమీ పట్టించుకోకుండా పవన్ ఈమధ్య నిర్వహించిన పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో తాను రాబోతున్న ఎన్నికల తరువాత కింగ్ మేకర్ అంటూ విపరీతమైన ఆత్మస్థైర్యంతో కామెంట్స్ చేయడం ఎవరికీ అర్ధంకాని విషయంగా మారింది. ఈ పరిస్థుతులలో ఈనాటి పవన్ నిర్వహించిన రహస్య పూజలు రాబోతున్న రోజులలో ఎలాంటి మార్పులను తెస్తాయో చూడాలి..