BIGG BOSS 2 ఫైనల్ గెస్ట్ తారక్ రెమ్యూనరేషన్?

ntr-bigg=boss2-remunertaion

బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 2 వంద రోజులకు పైగా పూర్తిచేసుకుని వచ్చే ఆదివారంతో ముగియనుంది. కంటెస్టెంట్స్ మధ్య పోటీ మరింత హెచ్చింది. ఇక ఓ సినీ స్టార్ వస్తారని, అది మామూలు ఎంట్రీ కాదని, వీరలెవెల్లో ప్లాన్ చేస్తున్నారని వైరల్ అవుతున్నాయి. ఈ షోకి గ్రాండ్ సెండాఫ్ ఇవ్వాలని బిగ్ బాస్ ఇప్పటీకే భారీగా ఏర్పాట్లు చేస్తోంది. ఆడియన్స్ కి సర్ ప్రయిజ్ ఇవ్వడానికి సీజన్ వన్ లో హోస్ట్ గా వ్యవహరించిన జూనియర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని సీజన్ టు ఫైనల్స్ కి పిలవాలని బిగ్ బాస్ టీమ్ భావించి, ఆమేరకు సంప్రదింపులు కూడా జరపడం, ప్రోగ్రాం ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. రెమ్యునరేషన్ ఏ రేంజ్ లో తీసుకుంటున్నాడో అనే అంశంపై జోరుగా చర్చించుకుంటున్నారు.

బిగ్ బాస్ హౌస్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ ,హౌస్ లో ఫైనల్ కి వచ్చిన కంటెస్టెంట్స్ ఫామిలీ మెంబర్స్ కూడా ఈ షోకి వస్తారన్న అంచనాతో స్పెషల్ గ్యాలరీ తీర్చిదిద్దుతున్నారు. అలాగే కొందరు కామన్ ఆడియన్స్ కూడా వస్తారట. వాళ్ళకోసం కూడా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇటలీలో అరవింద సమేత షూటింగ్ సాంగ్స్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ బిగ్ బాస్ కోసం రాబోతున్నట్లు తెలుస్తోంది.

అయితే గెస్ట్ గా రావడానికి దాదాపు 4కోట్ల వరకూ తీసుకున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అయితే స్టార్ మా నుంచి 2కోట్లే ఆఫర్ చేసారని వినిపిస్తోంది. నిజానికి తారక్ కి గల మార్కెట్ క్రేజ్ చాలా ఎక్కువే. ఇటీవల డాన్స్ షో ఫైనల్స్ కి వెళ్లిన తారక్ కి ఎంత ముట్టజెప్పారో తెలియదు గానీ, తారక్ గురించి టీజర్లను యూట్యూబ్ ద్వారా వేస్తూ,కొన్ని లక్షల ఆదాయాన్ని సదరు ఛానల్ వాళ్ళు పొందారట

దీన్ని బట్టి స్టార్ మా ఇచ్చిన రెండుకోట్ల ఆఫర్ తక్కువేనని వినిపిస్తోంది. అయితే స్టార్ మా యాజమాన్యంతో గల బంధం కారణంగానే, డబ్బు కన్నా రిలేషన్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ తారక్ రెండు కోట్లకు ఒప్పుకున్నట్లు చెబుతున్నారు.