టాప్ హీరోల ఇగో పై నాగార్జున సంచలన వ్యాఖ్యలు !

nag-about-top-heroes-egos

నాగార్జున ఒక జాతీయ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో టాప్ హీరోల ఇగో పై సంచలన వ్యాఖ్యలు చేయడమే కాకుండా తనకు కూడ ఉన్న ఈ ఇగో సమస్యను ఎటువంటి దాపరికం లేకుండా బయట పెట్టాడు. ప్రస్తుత కాలంలో ఒక యంగ్ డైరెక్టర్ ఒక టాప్ హీరోను హ్యాండిల్ చేయడం చాల కష్టమైన సమస్య అని చెపుతూ ప్రస్తుతం తనతో సహా చాలామంది టాప్ హీరోలు పొగరుగా ఉండటం తమ జన్మహక్కు అని భావిస్తున్నామని ప్రస్తుత టాప్ హీరోల ఇగో సమస్య పై సంచలన వ్యాఖ్యలు చేసాడు.

ఇదే సందర్భంలో తాను లేటెస్ట్ గా నటించిన ‘దేవదాసు’ సినిమాకు దర్శకత్వం వహించిన శ్రీరామ్ ఆదిత్యకు తాను పెట్టిన టార్చర్ గురించి కొన్ని యదార్ధ విషయాలను నాగార్జున బయటపెట్టాడు. ఈమూవీ షూటింగ్ లో తాను ఒకోసారి శ్రీరామ్ ఆదిత్య పై అరుపులు అరిచిన సందర్భాలు కూడ ఉన్నాయని అయితే ఇది అంతా తన ఇగో సమస్య వల్ల వచ్చిందని ఇప్పుడు ఆలస్యంగా తెలుసుకున్నాను అంటూ నిజాలను ఎటువంటి దాపరికం లేకుండా షేర్ చేసాడు నాగ్.

ఇక హీరో నాని గురించి మాట్లాడుతూ నానీతో తాను నటిస్తున్నప్పుడు తన తండ్రి అక్కినేని నాగేశ్వరావు పాత చిత్రాలలోని ఆయన నటన గుర్తుకు వచ్చింది అంటూ నానీ పై ప్రశంసలు కురిపించాడు నాగార్జున. దీనితో తాను నానీతో నటిస్తున్నప్పుడు చాల పోటీపడి ఎంతో జాగ్రత్తగా నటించవలసి వచ్చింది అంటూ భవిష్యత్తులో అవకాసం వస్తే నానీతో మరిన్ని సినిమాలు చేస్తాను అన్న సంకేతాలు ఇస్తున్నాడు.

ప్రస్తుతం కోలీవుడ్ హీరో ధనుష్ తో తాను కలిసి నటించబోతున్న సినిమాలో తన క్యారెక్టర్ డిజైనింగ్ చాల విభిన్నంగా ఉంటుంది అని చెపుతూ ఆమూవీ కోసం తాను గడ్డం పెంచుకోబోతున్నట్లు లీకులు ఇస్తున్నాడు. ఇలా ఎన్నో విషయాలు తన సినిమాల గురించి మాట్లాడుతూ ఇగో సమస్య నుండి బయటకు రాకపోతే తనతో సహా ఏహీరోకి అయినా కష్టాలు తప్పవు అని సంకేతాలు ఇస్తున్నాడు నాగార్జున..

News Journalist at Panipuri and Film Reviewer. Indian movies box office tracker.