ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారిన నిఖిల్ కష్టాలు !

title-problems-for-nikhils-mudra

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ‌కు వరస పెట్టి వస్తున్న కష్టాలు ప్రస్తుతం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి. ఈహీరోకి వరస ఫ్లాపుల పరంపర కొనసాగుతున్న నేపధ్యంలో అతడు ప్రస్తుతం నటిస్తున్న ముద్ర సినిమాపై గంపెడు ఆశలు పెట్టుకొన్నాడు. అయితే ఈసినిమా నిఖిల్‌ కు లేనిపోని టెన్షన్లు తెచ్చిపెడుతోంది అని వార్తలు వస్తున్నాయి.

ఈ పరిస్థితుల నేపధ్యంలో ఈయంగ్ హీరో పరిస్థితి గందరగోళంగా మారింది అని అంటున్నారు. ‘ఎక్కడికి పోతావు చిన్నదాన’ సినిమా హిట్ కావడంతో నిఖిల్ కెరీర్  ట్రాక్ లోకి వచ్చినట్లే అని చాలమంది అనుకున్నారు. అయితే ఆహిట్ ఇచ్చిన ఆనందం నిఖిల్ కు ఎక్కువ కాలం నిలబడలేదు. ‘కేశవ’ ‘కిర్రాక్ పార్టీ’ డిజాస్టర్లుగా మారడంతో నిఖిల్ కెరీర్ మళ్లీ కష్టాలలో పడింది.

వాస్తవానికి నిఖిల్ ‘ముద్ర’ చిత్రం పైనే చాలా ఆశలు పెట్టుకొన్నాడు. తమిళంలో ఘన విజయం సాధించిన ఘనిథన్ అనే సినిమాకు ఇది రీమేక్. తమిళ చిత్రానికి దర్శకత్వం వహించిన డైరెక్టర్ తెలుగు రీమేక్‌ కు కూడ పనిచేయడంతో అసలు సమస్యలు మొదలు అయ్యాయి అని అంటున్నారు. ఈ దర్శకుడు ఈమూవీ షూటింగ్ సమయంలో ఈమూవీ నిర్మాతకు ముప్పుతిప్పలు పెట్టినట్టు ఫిలింనగర్‌ టాక్.

ఈమూవీ డైరెక్టర్ వ్యహారసైలి వల్ల ‘ముద్ర’ పలుసార్లు వాయిదా పడింది అని అంటారు. ఈమూవీని  అక్టోబర్‌లో రిలీజ్ చేయాలని భావించినా రకరకాల కారణాలతో కుదరక పోవడంతో ఈమూవీ రిలీజ్ ను డిసెంబర్ 7 తేదీకి మార్చారు. అయితే నిఖిల్ సినిమాలకు ప్రస్తుతం క్రేజ్ లేకపోఅవడంతో ఈమూవీ బిజినెస్ చాల స్లోగా జరుగుతున్నట్లు టాక్. నకిలీ సర్టిఫికెట్ల ముఠా కథా నేపథ్యంలో రూపొందింప బడ్డ ఈమూవీ సక్సస్ కాకుంటే నిఖిల్ కెరియర్ మరింత సమస్యలలో పడుతుంది అని అంటున్నారు..

News Journalist at Panipuri and Film Reviewer. Indian movies box office tracker.