మోహన్ బాబు వైఎస్సార్ కాంగ్రెస్ లోకి వెళ్లడం ఖాయమేనా?

మంచు మోహన్ బాబు రాజకీయాలలోకి తిరిగి వస్తారని, వైఎస్సార్ కాంగ్రెస్ నుండి పోటీ చేస్తారని గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య ఆయన కుమారుడు విష్ణు రెండు పర్యాయాలు జగన్ ను వెళ్ళి కలిసొచ్చారు. ఇప్పుడు తాజాగా మోహన్ బాబు చంద్రబాబు నాయుడు పై తీవ్ర ఆరోపణలు చేశారు. 2014-15 నుంచి విద్యానికేతన్ విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడం లేదని, ఆ విషయంపై ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందించలేదని దుయ్యబట్టారు.

చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయారని, విద్యాభివృద్ధిపై ఏపీ సర్కార్‌కు ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు మోహన్ బాబు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇంటింటికీ తిరిగి.. అమలు కాని హామీలెందుకు ఇస్తున్నారు? అంటూ మోహన్ బాబు ప్రశ్నించారు. ఇదే సమయంలో తాను ఏ రాజకీయ పార్టీ తరపునా మాట్లాడటం లేదని ఆయన చెప్పుకొచ్చినా, ఆయన ఉద్దేశమేంటో కొంత మేర అర్ధమవుతూనే ఉంది.

Comments

comments