బిగ్ బాస్ విన్నర్ కోసం క్యూ కడుతున్న మీడియా ఛానెల్స్

media-channels-in-rush-for-kaushal

బిగ్ బాస్ సెకండ్ సీజన్ విన్నర్ కౌశల్ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. తనని విజేతగా నిలబెట్టిన కౌశల్ ఆర్మీతో ప్రెస్ మీట్ పెట్టి మిగతా ఇంటి సభ్యుల మీద కారాలు మిరియాలు నూరాడు కౌశల్. ఇంట్లోనే కాదు బయటకు వచ్చాక కూడా వారిని ఓ గేం ఆడుతున్నాడు కౌశల్. కౌశల్ ఆర్మీ సపోర్ట్ తోనే తన విజయం సుసాధ్యం అయ్యిందని అన్నారు.

ఇక కౌశల్ తో ఇంటర్వ్యూ కోసం ప్రముఖ ఛానెల్స్ అన్ని ఎగబడుతున్నాయి. బిగ్ బాస్ విన్నర్ గా తన ప్రత్యేకత చాటుకున్న కౌశల్ మీడియా ఛానెల్స్ అన్నిటికి వెళ్లి తన విజయ పరంపర గురించి చెప్పాలని భావిస్తున్నాడు. అయితే ఇంటి సభ్యుల గురించి మాట్లాడుతూ వారిపై నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

గేం ఎలాగు గెలిచాడు కాబట్టి ఎలాగు బయటకు వచ్చేశారు కదా తను గెలిచిన విధానం పోటీ పడ్డ విధానం గురించి చెబితే బెటర్ ఎందుకంటే ఎలా కాదన్న బయటకు వచ్చాక ఒక మాట అన్నా వారిని పర్సనల్ గా ఎటాక్ చేసినట్టు అవుతుంది. అందుకే ఇక మీదట మిగతా ఇంటి సభ్యుల గురించి కౌశల్ ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. .

ఇక కౌశల్ ఆర్మీ సపోర్ట్ తో తాను హీరోగా టర్న్ తీసుకుంటానని మాటిచ్చాడు కౌశల్. ఇక దర్శకుల వేటలో పడతానని.. రాజకుమారుడు సినిమాలో మహేష్ కు విలన్ గా నటించిన తాను మోడలింగ్ లో పవన్ చేత ప్రశంసలు అందుకున్నానని.. కచ్చితంగా కౌశల్ ఆర్మీ కోరిక మేరకు హీరోగా ప్రయత్నాలు మొదలు పెడతానని అన్నాడు కౌశల్. .