అమెరికా కంపెనీ సీఈఓగా సూపర్ స్టార్ మహేష్

మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న ‘మహర్షికి సంబంధించిన కొత విషయం బయటకు వచ్చింది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాలో ప్రిన్స్‌ స్టూడెంట్‌గా కన్పిస్తాడన్న విషయం తెలిసింది.. యూత్‌లుక్‌లో ఇప్పటికే మనసును దోచేస్తున్న మహేష్‌ పాత్రకు సంబంధించిన మరో కోణం ఉందని చెబుతున్నారు.. అశ్వనీదత్‌, దిల్‌రాజు , పివిపి ముగ్గురు అగ్రనిర్మాతలు కలిసి నిర్మిస్తున్న ఈచిత్రంలో మహేష్‌బాబు రిషి పాత్రలో అలరించనుంటే..రవి పాత్రలో అల్లరి నరేష్‌ కన్పిస్తారని చెబుతున్నారు.

ఈసినిమాకు సంబంధించిన షూటింగ్‌ షెడ్యూల్‌ వచ్చే నెల 15న ప్రారంభం కానుంది.. దాదాపు 25 రోజులపాటు సాగే ఈ షెడ్యూల్‌ అమెరికాలో జరగనుంది.. మహర్షిలో స్టూడెంట్‌ పాత్రలో కన్పించే మహేష్‌,, తాజా షెడ్యూల్‌లో మాత్రం ఒక పెద్ద ఐటి కంపెనీ సిఇఒగా దర్శనమిస్తారని తెలుస్తోంది.. అందుకు సంబంధించిన సన్నివేశాలను అమెరికాలో తీయనున్నట్టు తెలిసింది.. అంతేకాకుండా ముఖ్యమైన 2 పాటలనుకూడ ఈ షెడ్యూల్‌లోనే పూర్తిచేయటానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది..