మహేష్, అనిల్ రావిపూడి సినిమాలో హైలెట్ సీన్ ..!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు టైమ్ నడుస్తోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన కెరీర్లో 25వ సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో రక్ష సంబరాలు చేసుకుంటున్నారు మహేష్. ఇదిలా ఉండగా తన తర్వాత సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ హీరోగా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమాకి రెడ్డిగారి అబ్బాయి, సరిలేరు నీకెవ్వరూ అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి.

ఈ చిత్రంలో దేశభక్తి, హాస్యం ప్రధానంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి కామెడీ తరహాలో మహేష్ బాబు సినిమా ని డైరెక్ట్ చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమాపై ఇండస్ట్రీలో ఆసక్తి నెలకొంది. గతంలో అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్, ఎఫ్2 సినిమాలు బీభత్సమైన కామెడీ హిట్లు అవడంతో ఇండస్ట్రీలో అనిల్ రావిపూడి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా మారిపోయారు.

ఇదిలా ఉండగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ చేయబోయే సినిమాలు అదిరిపోయే కామెడీ సన్నివేశాన్ని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ సన్నివేశం సినిమా మొత్తానికే హైలైట్ గా నిలవనుందట.ట్రైన్ లో ఈ ఫన్నీ సన్నివేశం జరుగుతుందని అంటున్నారు. గతంలో రవితేజ వెంకీ చిత్రంలో ట్రైన్ సీన్ కడుపుబ్బా నవ్వించేలా ఉంటుంది. అదే తరహాలో అనిల్ రావిపూడి మహేష్ చిత్రంలో ఓ కామెడీ ట్రాక్ సిద్ధం చేశాడట. ప్రస్తుతం ఈ వార్త ఫిలింనగర్ లో హాట్ టాపిక్ అయింది.

Comments

comments