అసంతృప్తిలో మహేష్.మహర్షి రీషూట్

maharshi-reshoot

మహేశ్ బాబు తాజా చిత్రంగా ‘మహర్షి’ రూపొందుతోంది. మహేశ్ బాబుకి ఇది 25వ సినిమా కావడం వలన ఇది ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. అందువలన మహేశ్ అభిమానుల అంచనాలను అందుకునేలా వంశీ పైడిపల్లి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ షూటింగు జరుపుకుంది.

ఇంతవరకూ వచ్చిన అవుట్ పుట్ ను రీసెంట్ గా దర్శక నిర్మాతలు .. మహేశ్ బాబు కలిసి చూశారట. కీలకమైన కొన్ని సన్నివేశాలు తాను ఆశించినట్టుగా రాలేదంటూ మహేశ్ బాబు అసంతృప్తిని వ్యక్తం చేశాడట. ఆ సన్నివేశాలను రీ షూట్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడట. దాంతో దర్శకనిర్మాతలు అందుకు అంగీకరించినట్టుగా ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు. ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.