దీప్తి ఓటింగ్ తో ఏమి చేయాలో అర్ధం కానీ స్థితిలో కౌశల్ ఆర్మీ

ఫారిన్ లో బిగ్ బ్రదర్ పేరిట నడుస్తున్న రియాల్టీ షోనే ఉత్తరాదిన బిగ్ బాస్ గా మొదలై ఇప్పటికే 10సీజన్లు పూర్తిచేసు కుంది. సల్మాన్ ఖాన్ హోస్ట్ గా సాగుతున్న బిగ్ బాస్ హిందీ వెర్షన్ 11వ సీజన్ కి సన్నద్ధం అయింది. అయితే రెండేళ్ల క్రితమే బిగ్ బాస్ షో తెలుగువారికి పరిచయం అయింది. తారక్ హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ వన్ ఆకట్టుకోగా, నాని హోస్ట్ తో రెండవ సీజన్ జోరుగా సాగుతోంది. మరో వారం రోజుల్లో సెకండ్ సీజన్ ముగియనుంది. వారంలో ముగియడం అంటే, ఫైనల్ స్టేజ్ లో ఉంది కదా. తారాస్థాయిలో గేమ్ నడుస్తోంది. ఇక బిగ్ బాస్ లో ఎవరు విన్నర్ అవుతారో అనే అంశంపై విశ్లేషణలు,చర్చలు జరిగిపోతున్నాయి.

ఇప్పటివరకూ ఓ లెక్క ,ఇకనుంచి ఓ లెక్క అన్నట్టు వోటింగ్ కూడా సాగుతోంది. ఈ వారం ఓటింగ్ ఆదివారం మొదలు కాగా, దీప్తి రాకెట్ స్పీడ్ తో ఓటింగ్ లో దూసుకెళ్తోంది. ఈమెకు అత్యధిక ఓట్లు నమోదవుతున్నట్లు ట్రెండ్ చెబుతోంది. భారీ ఓటింగ్ తో బాగా అగ్రస్థానంలో దీప్తి దూసుకుపోతుంటే ఆతర్వాత కౌశల్,గీతా మాధురి,తనీష్ , సామ్రాట్ ఉన్నారంటే అందరికీ ఆసక్తి కల్గిస్తోంది. ఇక గ్రాండ్ ఫినాలేకి చేరిన సామ్రాట్ ఓట్ల పరంగా చిట్టచివరి స్థానంలో ఉన్నాడు. ఇక ఇప్పటివరకూ ఓట్ల పరంగా ముందంజలో ఉంటూ వచ్చిన కౌశల్ ఈ వారం ఎందుకో ఆశించిన స్థాయిలో ఓట్లు పడలేదు.

సగటు ప్రేక్షకుడు ఓటింగ్ కి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. కౌశల్ గెలుపు గురించి కౌశల్ ఆర్మీ చూసుకుంటుందిలే అని చాలామంది ఓట్ చేయడం లేదు. ఈసారి కి తాము ఓటువేయకపోతే ఇంకొకళ్ళు వేస్తారులే అనే ధోరణి కనిపిస్తోందని క్రిటిక్స్ అంటున్నారు. దీనివల్లనే కౌశల్ కి ఓట్లు తగ్గిపోయాయని,కౌశల్ ఆర్మీ 2కె వాక్ లపై శ్రద్ధ చూపిస్తూ ఓట్లు విషయంలో నిర్లిప్తంగా ఉంటున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇదే కొనసాగితే గ్రాండ్ ఫినాలేలో నిరాశ తప్పదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.