జగన్ కు తప్పని బాబాయ్ తలపోటు

రేపు పోలింగ్ జరగబోతున్నా వైఎస్ జగన్ కు ఇంటి పోరు తప్పడం లేదు. జగన్‌ బాబాయి, ఒంగోలు తాజా మాజీ ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి ఇంకా అలక పానుపు దిగలేదు. జగన్ ఆయనకు టిక్కెట్ నిరాకరించడంతో ఎన్నికల వేళ కూడా ప్రకాశం జిల్లాలో అడుగు పెట్టలేదు. ఆయన అనుయాయులు తలో దిక్కు అన్నట్టు అయిపోయారు. ఇటు పార్టీ జిల్లా కీలక నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డితోనూ, అటు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డితోనూ పొసగక… పార్టీ తనను మోసం చేసిందని కుమిలిపోతున్నారు.

ఫిబ్రవరి నెలాఖరు నుంచి వై.వి. జిల్లాలో అడుగుపెట్టలేదు. దీనితో ఆయన వెంట ఇప్పటివరకూ నడిచిన ద్వితీయ శ్రేణి నాయకులు కొందరు టీడీపీ లో చేరగా, ఇంకొందరు తటస్థంగా ఉండిపోయారు. మరికొందరు పనిగట్టుకుని మరీ ఇక్కడి ఒకరిద్దరు వైఎస్సార్సీపీ అభ్యర్థులను ఓడించే పనిలో ఉన్నారని సమాచారం. గత ఎన్నికలలో మెజార్టీ స్థానాలు గెలుచుకున్న ఆ పార్టీ ఇప్పుడు ఈ పరిణామాలతో ఎటూ పాలుపోని పరిస్థితి లో ఉన్నారు.

Comments

comments