అది వర్క్ అవుట్ అయితే అరవింద సమేత రికార్డులే..!

if sentiment works then no one can stop aravindha sametha

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రం కలిసి చేసిన సినిమా అరవింద సమేత వీర రాఘవ. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో చాలా రోజుల తర్వాత ఎన్.టి.ఆర్ ఫుల్ లెంగ్త్ మాస్ రోల్ లో చూపిస్తున్న సినిమాగా నందమూరి ఫ్యాన్స్ లో అంచనాలు తారాస్థాయిలో పెట్టుకున్నారు. రిలీజైన పోస్టర్స్ మాత్రమే కాదు ట్రైలర్ కూడా అదరగొట్టేసింది.

సినిమాలో యాక్షన్ పార్ట్ ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తున్నా త్రివిక్రం మార్క్ డైలాగ్ పవర్ కూడా ఉంటుందని అంటున్నారు. అయితే ట్రైలర్ ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా కట్ చేశారని ముందునుండి చెబుతున్నారు. అయితే సినిమాలో సెంటిమెంట్ పాళ్లు కాస్త ఎక్కువేనట. అది వర్క్ అవుట్ అయ్యింది అంటే వీర రాఘవ రికార్డులు సృష్టించడం ఖాయమని అంటున్నారు.

ఎమోషనల్, సెంటిమెంట్ సీన్స్ లో తన వీర ప్రతాపం చూపించే ఎన్.టి.ఆర్ అరవింద సమేత సినిమాలో హృదయాలను కదిలించడం ఖాయమని తెలుస్తుంది. ఆ ఎమోషన్ కనుక ఆడియెన్స్ కు కనెక్ట్ అయితే ఇక అరవింద సమేతని ఆపడం ఎవరి వల్ల కాదని అంటున్నారు. ఇప్పటికే సినిమా బిజినెస్ ఎన్.టి.ఆర్ కెరియర్ లో హయ్యెస్ట్ బిజినెస్ చేస్తుంది.

ఇప్పటికే నిర్మాత రాధాకృష్ణ డిజిటల్, శాటిలైట్ ఇతరత్రా హక్కులతో 40 కోట్ల లాభం పొందారని తెలుస్తుంది. పూజా హెగ్దె, ఈషా రెబ్బ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించారు. గురువారం రాబోతున్న అరవింద సమేత వీర రాఘవుడు ఎలాంటి సంచలనాలను సృష్టిస్తాడో చూడాలి.

News Journalist at Panipuri and Film Reviewer. Indian movies box office tracker.