తెలుగు స్టార్ హీరోకు హీరోయిన్ బెదిరింపులు

heroine-blackmailing-tollywood-top-hero

మీ టూ ఉద్యయం ఇప్పుడు అందరినీ కుదిపేస్తోంది. హీరోయిన్స్ తమకు జరిగిన చేదు అనుభవాలను బయటికి చేబుతున్నారు అయితే కొంత మంది హీరోయిన్స్ దీనిని పక్క దారి పట్టిస్తున్నారని చాలా మంది ఆరోపిస్తున్నారు. అయితే ఈ మూమెంట్ లో మరో కోణం కూడా బయటపడింది. మీ-టు ఉద్యమం పేరుతో బ్లాక్ మెయిల్స్ కూడా ప్రారంభమయ్యాయి. అలాంటి ఉదంతమే ఇది.

అందర్నీ షాక్ కు గురిచేస్తూ మీ-టూ ఉద్యమాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది ఓ మాజీ హీరోయిన్.టాలీవుడ్ లో ఓ హీరోను బెదిరిస్తోంది. ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తోంది. తను కోరినంత డబ్బు ఇవ్వకపోతే గతంలో తమ మధ్య జరిగిన కొన్ని సీక్రెట్ ఎఫైర్లను బయటపెడతానంటూ భయపెడుతోంది. ఇప్పటికే చాలామంది నటులపై కొంతమంది హీరోయిన్లు కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేశారు. అయితే వాటికి ఎక్కడా సాక్ష్యాలు లేవు. కోర్టులో వాటిని నిరూపించడం కూడా చాలా కష్టం.

ఎందుకంటే, ఎప్పుడో 10-12 ఏళ్ల కిందటి చేదు అనుభవాలవి. కానీ సదరు నటులు మాత్రం మీడియాలో బ్యాడ్ అయిపోయారు. ఇప్పుడు ఈ హీరో భయం కూడా అదే. ఈ హీరోయిన్ కు కావాల్సింది కూడా ఇదే. ఇండస్ట్రీలో తనకంటూ ఓ మంచి ఇమేజ్, క్రేజ్ తెచ్చుకున్న హీరో అతడు. ఓ పెద్ద హిట్ తో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ హీరో, తర్వాత తనకంటూ ఓ స్టయిల్, డాన్స్ బాగా చేస్తాడనే ఇమేజ్ తెచ్చుకున్నాడు. పరిశ్రమలో బ్యాకప్ కూడా ఉంది. కానీ ఇలాంటి ఆరోపణలు వస్తే తట్టుకోవడం కష్టం. నిజానిజాలు పక్కనపెడితే మీడియా అంతా పదేపదే అతడ్నే చూపించి బద్నామ్ చేస్తుంది. అదే ఇప్పుడీ హీరో భయం.

News Journalist at Panipuri and Film Reviewer. Indian movies box office tracker.