హీరోయిన్ తో ప్రేమలో దేవిశ్రీప్రసాద్

హీరోయిన్ తో ప్రేమలో దేవిశ్రీప్రసాద్

తెలుగులో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్. ఆయన నడిచే సంగీతం. యూత్ పల్స్ పట్టుకుని కిర్రాక్ పెట్టించే టాలెంట్ కలిగిన మ్యుజీషియన్. దేవీశ్రీ ఓన్లీ మ్యూజిక్కే కాదు, డ్యాన్స్ కూడా బాగా చేసే రాక్ స్టార్. ఇంతటి ప్రతిభ ఉన్న దేవీశ్రీ ఇంకా పెళ్ళి చేసుకోలేదు. ఆయన విషయంలో ఎన్నో పుకార్లు షికార్ చేసాయి, చేస్తున్నాయి. లేటెస్ట్ గా దేవీశ్రీ పెళ్ళి చేసుకోబోతున్నాడని మళ్ళీ హాట్ న్యూస్ స్ప్రేడ్ అవుతోంది.

పూజిత అనే సినీ హెరోయిన్ తో దేవీశ్రీ పెళ్ళి పీటలు ఎక్కబోతున్నాడని టాక్ నడుస్తోంది. ఈ పూజిత ఎవరు అని ఆరా తీస్తే రంగస్థలం మూవీలో ప్రకాష్ రాజ్ కూతురుగా, ఆది పినిశెట్టి లవర్ గా నటించిన ముద్దు గుమ్మ అని తెలుస్తోంది. దేవీశ్రీ ఆ అమ్మడితో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడని కూడా న్యూస్ వైరల్ అవుతోంది. ఇది నిజమే అయితే తొందరలోనే ఈ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్ పెళ్ళి పీటలు ఎక్కుతాడని అంటున్నారు.

ఇక దేవీశ్రీకి ఎందరో హీరోయిన్లు ఫ్యాన్స్ గా ఉన్నారు. ఒకప్పుడు చార్మీతో దేవీకి అఫైర్స్ ఉన్నాయని కూడా వార్తలు వచ్చాయి. అలాగే మరికొంతమంది హీరోయిన్లతో కూడా దేవీశ్రీ లవ్ ట్రాక్ నడిచిందని చెబుతారు. మరి పూజిత కధ కూడా అలాంటి న్యూసేనా, లేక నిజంగా దేవీశ్రీ ఆమెతో కలసి ఏడడుగులు నడవబోతున్నాడా అన్నది చూడాలి. మొత్తానికి దేవీశ్రీ పెళ్ళి చేసుకోవాలని ఆయన అభిమానులంతా గట్టిగానే కోరుకుంటున్నారు.

News Journalist at Panipuri and Film Reviewer. Indian movies box office tracker.