బిగ్ బాస్ హౌస్ నుండి దీప్తి ఎలిమినేటడ్

బిగ్ బాస్ హౌస్ నుండి దీప్తి ఎలిమినేటడ్?

తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 ఈ వారం తో ముగియనుంది.గత 100 రోజులకు పైగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న ఈ షో ఈ వారం తో పూర్తీ కావడం అభిమానులను , ప్రేక్షకులను బాధ పెడుతుంది. రాత్రి 9 : 30 నిమిషాలైతే చాలు టీవీలకు హత్తుకుపోయి హౌస్ లో ఏం జరుగుతుందో అనే ఆతృతగా ఈ షో ను చూసేవారు. ఇక ఈ సీజన్ 2 నుండి తాజాగా దీప్తి ఎలిమేషన్ అయినట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం హౌస్ లో కౌశల్ , గీత , సామ్రాట్ , దీప్తి , తనీష్ లు ఉండగా ..ఈరోజు జరగబోయే మిడ్‌ వీక్‌ ఎలిమినేషన్‌ లో దీప్తి బయటకు వెళ్లబోతుందని ఓట్లను బట్టి తెలుస్తుంది. దీప్తి బయటకు వెళ్తే నలుగురు మాత్రమే హౌస్ లో ఉంటారు. వారిలో ఇద్దరు గ్రాండ్‌ ఫినాలేలో ఎలిమినేట్‌ అయి, మరో ఇద్దరు ఫైనల్‌కు చేరుకుంటారు. వారిలో ఒకరు విజేతగా బిగ్‌ బాస్‌ సీజన్‌ 2 విజేతగా నిలుస్తారు. మరి ఉన్న ఈ నలుగురి లో విజేత అయ్యేది ఎవరో చూడాలి.