ముదిరిన దీప్తి నల్లమోతు ఫేక్ ఓటింగ్ వివాదం..

బిగ్‌బాస్ తెలుగు 2 విజేత ఎంపిక కోసం కంటెస్టెంట్ దీప్తి నల్లమోతుకు ఫేక్ ఓటింగ్ చేస్తున్నారంటూ వస్తున్న వార్తలపై ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ ఎండీ శ్రీరాం లతీష్ స్పందించారు. తమపై ఆరోపణలు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న కౌశల్ ఆర్మీపై ఆయన కేసు నమోదు చేశాడు. ఈ మేరకు హైదరాబాద్ గచ్చిబౌలి పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ వివాదంలో అసలేం జరుగుతున్నదంటే..

ప్రస్తుతం బిగ్‌బాస్ ఫైనల్ ఆదివారం (సెప్టెంబర్ 30న) జరుగబోతున్నది. కౌశల్, గీతా మాధురి, దీప్తి నల్లమోతు, సామ్రాట్ రెడ్డి, తనీష్ టైటిల్ రేసులో ఉన్నారు. వీరిలో కౌశల్ ముందంజలో ఉన్నట్టు వార్తలు అందుతున్నాయి. ఆ తర్వాత గీతామాధురి ఉన్నట్టు సమాచారం.

అయితే గత కొద్దిరోజులుగా దీప్తి నల్లమోతు ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగింది. ఈ పరిణామం కౌశల్ ఆర్మీతోపాటు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేసింది. దాంతో దీప్తి నకిలీ ఓట్లతో ముందుకెళ్తున్నది. ఆమె ఫేక్ ఓటింగ్ వెనుక రామిట్ సొల్యూషన్స్ ఉంది అని ట్విట్టర్‌లో సందేశాలు వెల్లువెత్తాయి.

అంతేకాకుండా ఫేక్ ఓటింగ్ జరుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నాని, బిగ్‌బాస్ టీమ్‌కు సోషల్ మీడియా ద్వారా కోరారు. నానిగారు.. దీప్తి, రామిట్ మధ్య ఉన్న సంబంధంపై ఎంక్వైరీ వేయండి. అదే విషయాన్ని శనివారం వేదికపై నుంచి చెప్పండి అంటూ కోరారు.

దీప్తి ఫేక్ ఓటింగ్ అంటూ కౌశల్ ఆర్మీ చేసిన కామెంట్లపై రామిట్ సొల్యూషన్ కంపెనీ అధినేత శ్రీరాం లతీష్ స్పందించారు. మా కంపెనీకి దీప్తి నల్లమోతు క్లయింట్. తాము పలు బ్రాండ్స్‌ను ప్రమోట్ చేస్తాం అని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.