#RC12:చిరంజీవికి టైటిల్ నచ్చలేదు,టెన్షన్ లో దానయ్య

Ram Charan's Special Announcement on Chiranjeevi's Birthday

రామ్ చరణ్ మూవీ ఫస్ట్ లుక్ దసరా రోజు విడుదల అవుతుందని మెగా ఫాన్స్ సంతోష పడ్డారు. దసరా వెళ్లి పోతోంది కాని ఈమూవీ ఫిస్ట్ లుక్ విడుదల కాక పోవడంతో మెగా ఫాన్స్ తీవ్ర నిరాశకు లోను అవుతున్నారు. వాస్తవానికి ఈ సినిమాకు  వినయ విధేయ రామ టైటిల్ ఫిక్స్ అయిపోయింది అని అందరు భావించారు.

వినయ విధేయ రామ టైటిల్‌ బోయపాటికి బాగా నచ్చడంతో  మెగా ఫ్యాన్స్‌ ఫీడ్‌ బ్యాక్‌ కోసమని ముందుగా లీక్‌ చేసారు. అయితే ఈ టైటిల్‌ చిరంజీవికి ఏమాత్రం నచ్చలేదు అని టాక్. అంతేకాదు ఈ మూవీ మాస్‌ సినిమా అయినప్పటికీ  కావాలని క్లాస్‌ అప్పీల్‌ కోసం తాపత్రయ పడుతున్నట్టుఉంది అని చిరంజీవి  బోయపాటి వద్ద కామెంట్స్ చేసినట్లు టాక్.

ఇది ఇలా ఉండగా ఈ సినిమా విడుదల డేట్ జనవరి 11 అని ఫిక్స్ అయినప్పటికీ  ఇంకా మరో ముపై రోజులు షూటింగ్ పెండింగ్ ఉందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే నూట అయిదురోజుల వరకు ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరిగినా  ఇంకా  ముపై రోజులు  షూటింగ్ పెండింగ్ లో  ఉండటం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. బోయపాటి ఈ  మూవీ పెట్టిస్తున్న  ఖర్చు ఇప్పటికే   వందకోట్లు దాటి పోవడంతో నిర్మాత దానయ్య తీవ్ర టెన్షన్ లో ఉన్నట్లు టాక్.

News Journalist at Panipuri and Film Reviewer. Indian movies box office tracker.