చంద్రబాబు రోజాకు అక్రమ సంబంధం అంటగట్టాలని చూశారా?

chandrababu and roja

ఇటీవలే తెలుగుదేశం పార్టీ నుండి వైకాపాలో చేరిన చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ చంద్రబాబుపై సంచలన ఆరోపణ చేశారు. ఆ మధ్య జరిగిన నంద్యాల ఉపఎన్నిక సందర్భంగా అప్పటి ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌ టీడీపీకి సహకరించడం లేదని, తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆగ్రహంతో ఎమ్మెల్యే రోజాతో భన్వర్‌లాల్‌కు అక్రమ సంబంధం అంటగట్టాలని, ఆ మేరకు ప్రచారం చేయాలని నాడు ఆ నియోజకవర్గానికి ఇన్‌చార్జులుగా వ్యవహరించిన తనతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలను ఆదేశించారని ఆమంచి చెప్పుకొచ్చారు.

అయితే దానికి తామంతా ఒప్పుకోలేదని ఆయన చెప్పుకొచ్చారు. ఇది నిజం కాదంటే నార్కో పరీక్షలకైనా సిద్ధం కావాలన్నారు. లేదంటే చంద్రబాబు తన మనవడు దేవాన్ష్ పై ప్రమాణం చేసి చెప్పాలని ఆయన సవాలు విసిరారు. ఈ ఆరోపణపై చంద్రబాబు ఏమని స్పందిస్తారో చూడాలి. టీడీపీ నాయకులు మాత్రం ఓటమి భయంతోనే ఆమంచి ఇటువంటి చావుకబారు విమర్శలు చేస్తున్నారని అంటున్నారు.

Comments

comments