వైఎస్సార్ కాంగ్రెస్, జనసేనకు చంద్రబాబు ట్రాప్

chandrababu-trap-for-ysrcp-and-janasena

ప్రత్యేక హోదా కోసం తెలుగుదేశం చేస్తున్న ధర్మ పోరాట దీక్ష ఇప్పుడు ఢిల్లీకి చేరబోతోంది. మంత్రులు, ముఖ్యనాయకులు, ఉద్యోగ, ప్రజా సంఘాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 11న ఢిల్లీ లో దీక్ష చెయ్యబోతున్నారు. పార్టీ ఎమ్మెల్యేలంతా అనుచరులతో సహా హాజరవ్వాలని సీఎం ఆదేశించారు. 11న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల చివరి రోజు. అయితే కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడంతో పాటు ప్రతిపక్ష పార్టీలను కూడా ఇరుకున పెట్టాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు.

ఆ దీక్షలో పాల్గొనాల్సిందిగా వైకాపా, జనసేన సహా అన్ని పార్టీలకు లేఖలు రాయాలని నిర్ణయించారు సీఎం. ఒకవేళ వారు రాకపోతే వారిని బీజేపీ తొత్తులుగా చిత్రీకరించవచ్చు. మొన్న ఈ మధ్య చంద్రబాబు ఏర్పాటు చేసిన అఖిలపక్ష పార్టీలకే రాని పార్టీలు ఈ దీక్షా కార్యక్రమంలో పాల్గొంటారనేది జరిగే పని కాదు. వైకాపా అయితే అసలు సమస్యే లేదు. పవన్ కళ్యాణ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ప్రధాని గుంటూరు వచ్చిన ఒక్క రోజు తరువాత ఈ దీక్ష జరగబోతుండడం విశేషం.

Comments

comments