చంద్రబాబు హుద్‌హుద్‌ తుపాన్‌ లాంటోడు

వైఎస్సార్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ విజయ సాయి రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై విరుచుకుపడ్డారు. చంద్రబాబు హుద్‌హుద్‌ తుపాన్‌ లాంటి వారని..తుపాన్‌ కంటే ఎక్కువగా రాష్ట్రాన్ని ప్రతిరోజూ నాశనం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బీజేపీతో అధికారాన్ని పంచుకున్న చంద్రబాబు..రాష్ట్రానికి అన్యాయం జరగడానికి ప్రధాన కారకుడని అప్పులు తీసుకొచ్చి ధర్మపోరాట దీక్షలపేరుతో అధర్మపోరాటాలు చేస్తున్నారని విమర్శించారు.

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తప్పక గెలిపిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు తాజాగా నేషనల్ మీడియా నుండి వచ్చిన మరో సర్వేలో వైఎస్సార్ కాంగ్రెస్ కు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 23 ఎంపీ సీట్లు వస్తాయని, అధికార పక్షం తెలుగుదేశం పార్టీకి కేవలం 2 సీట్లు మాత్రమే వస్తాయని చెప్పింది. ఇదే జరిగితే ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ స్వీప్ అని చెప్పుకోవచ్చు.