కౌశల్ దూకుడు తట్టుకునే సత్తా బిగ్ బాస్ కి ఉందా?

రియాల్టీ షోలో పాపులర్ గా మారిన బిగ్ బాస్ షో కి అనూహ్య స్పందన లభిస్తున్న సంగతి తెల్సిందే. ఇక వారంలో ముగియనున్న బిగ్ బాస్ సీజన్ 2లో విన్నర్ అనే దానిపై తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఖండాంతరాలలో కూడా ఉత్కంఠ నెలకొంది. ఎక్కడ చూసినా దీని గురించే చర్చ నడుస్తోంది. ఎందుకంటే, బిగ్ బాస్ గేమ్ ఇన్నాళ్లూ ఒకలెక్క అయితే ఇకనుంచి మరోలెక్క అనవచ్చు. కీలకమైన ఫైనల్స్ దశకు చేరడంతో కంటెస్టెంట్స్ లో కూడా పోటీ మరింత హెచ్చింది.

టైటిల్ గెలుచుకునేది ఎవరని అడిగితే, ఎవరైనా ఠక్కున చెప్పేది కౌశల్ పేరు మాత్రమే. ఎందుకంటే,బిగ్ బాస్ సీజన్ టులో మొదటినుంచి ఓ పక్కా ప్రణాళికతో గేమ్ ఆడుతున్న కౌశల్ కోట్లాది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇప్పుడు టైటిల్ గెలవడమే లక్ష్యంగా చేసుకున్న కౌశల్ అసలు ఫైనల్స్ లో ఎవరెవరు ఉంటారో,వాళ్ళ మైండ్ సెట్ ఏమిటో, వాళ్ళను ఎలా ఎదుర్కోవాలో వంటి విషయాలపై స్పష్టమైన అవగాహన గల కౌశల్ మొన్నటి రోజున అసహనం వ్యక్తంచేయడం కూడా గేమ్ లో భాగమేనని అంటున్నారు.

ఒక్కోసారి పాజిటివ్ అనుకున్నది నెగెటివ్, అలాగే నెగెటివ్ అనుకున్నది పాజిటివ్ అవుతుంటాయి. అందుకే అన్నీ తెల్సిన కౌశల్ ఎప్పుడు ఎలా ఉండాలో అలానే ఉంటూ వచ్చాడు . ఇక మున్ముందు కూడా కౌశల్ తన దూకుడు కొనసాగించడం ఖాయం. మరి హౌస్ మేట్స్ కౌశల్ వేసే ఎత్తుగడను తట్టుకుంటాడా లేదా అన్నది చూడాలి. గెలుపే లక్ష్యంగా కౌశల్ అనుసరించే వ్యూహం ఇప్పటికే కన్ఫర్మ్ అయిందని అంటున్నారు. చూద్దాం ఏమౌతుందో.