ఎట్టకేలకు మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు?

తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారు అయ్యిందని వార్తలు వస్తున్నాయి. ఈ నెల 31న లేదా వచ్చే నెల 10న మంచి ముహూర్తాలు ఉండటంతో.. మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చని సమాచారం. ఈ రోజు సాయంత్రం గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో జరిగిన ఎట్ హోం కార్యక్రమంలో ఇదే అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ విషయాన్ని కేసీఆర్ కూడా గవర్నర్ నరసింహన్ కు సూత్రప్రాయంగా తెలిపినట్టు సమాచారం.

తొలుత 10 మందితో కేబినెట్ ఏర్పాటు చేసి.. లోక్‌సభ ఎన్నికల అనంతరం మరో ఆరుగురిని తీసుకొనే అవకాశం ఉందంటున్నారు నేతలు. తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చి 45 రోజులు దాటినా ఇప్పటివరకు పూర్తి స్థాయి మంత్రివర్గం లేదు. ముఖ్యమంత్రితో పాటు మహమూద్ అలీ మాత్రమే హోమ్ మంత్రిగా ఉన్నారు. ఎన్ని వివాదాలు, విమర్శలు వచ్చినా కేసీఆర్ మాత్రం ఫెడరల్ ఫ్రంట్ పర్యటనలని, యాగం అంటూ తన పంథాలో తను ముందుకు పోతున్నారు.