ఎన్టీఆర్ కామెంట్స్ కి బయ్యర్లు భయపడుతున్నారా??

buyers-in-tension-of-ntr-comments

ఈవారం విడుదల కాబోతున్న ‘అరవింద సమేత’ ను ప్రమోట్ చేస్తూ జూనియర్ చేసిన వ్యూహాత్మక కామెంట్స్ వెనుక అర్ధాలు ఏమిటి అన్న కోణంలో ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి. ఎవరికైనా జీవిత ప్రయాణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది అని అంటూ కొన్నిసార్లు చివరి ఫలితం చాలా చేదుగా ఉంటుంది అన్న జీవిత సత్యాన్ని చెపుతూ ఫలితం ఎలా ఉన్నా దాన్ని ఆహ్వానించే శక్తి ప్రతి మనిషికీ ఉండాలి అంటూ జూనియర్ చేసిన కామెంట్స్ దేనికి సంకేతం అంటూ ఈమూవీని అత్యంత భారీ మొత్తాలకు కొన్న బయ్యర్లు భయపడుతున్నట్లు సమాచారం.

అంతేకాదు త్రివిక్రమ్ తో సినిమా చేయడం తన 12 ఏళ్ల నిరీక్షణకు ఫలితమని చెపుతూ ‘అరవింద సమేత’ కథ నచ్చడం వల్ల తాను ఈసినిమాలో నటించాను కానీ ఈమూవీ అంతిమ ఫలితం కోసం తాను ఆలోచించడం లేదు అంటూ జూనియర్ చేసిన కామెంట్స్ పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అదేవిధంగా ‘అజ్ఞాతవాసి’ సినిమా ఫ్లాప్ తరువాత త్రివిక్రమ్‌ పై ఉన్న ఒత్తిడి గురించి మాట్లాడుతూ సినిమా రంగంలో హిట్స్ మరియు ఫ్లాప్స్ సర్వసాధారణం అంటూ తనకు కూడ అనేక ఫ్లాప్ లు వచ్చాయి కదా అంటూ కామెంట్స్ చేసాడు ఎన్టీఆర్.

ఇదే మీడియా మీట్ లో మరొక ట్విస్ట్ ఇస్తూ తాను ఒక సినిమా చేసేడప్పుడు తన ఫ్యాన్స్ గురించి ఇంకా ఎదో చేయాలి అని ఆలోచించనని సినిమా రిలీజ్ తర్వాత ఏం జరుగబోతుందనే విషయం ఎవరూ అంచనా వేయలేరు అంటూ మన ముందుకు ఏది వస్తే దానిని అంగీకరించాలి అంటూ జూనియర్ చేసిన కామెంట్స్ ను బట్టి అతడికి ‘అరవింద సమేత’ రిజల్ట్ పై సందేహాలు ఉన్నాయా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.