త్రివిక్రమ్-బన్నీ మధ్య మనస్పర్థలు

Title Confirmed For Allu Arjun-Trivikram Movie

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రం ఇద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా ఈమధ్యనే ఓ సినిమా స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్ తో పాటుగా గీతా ఆర్ట్స్ బ్యానర్ కూడా నిర్మిస్తుంది. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో టబు కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని తెలిసిందే.

మొదటి షెడ్యూల్ పూర్తయిన ఈ సినిమా సోమవారం నుండి సెకండ్ షెడ్యూల్ మొదలు పెట్టాల్సి ఉందట. అయితే అల్లు అర్జున్ ఫారిన్ ట్రిప్ వల్ల షూటింగ్ కు అందుకోలేదట. మండే మిస్సైనా మంగళవారం అయినా బన్ని వస్తాడని ఆశించగా ఆరోజు మిస్సయ్యాడట. బన్ని ప్రవర్తన వల్ల త్రివిక్రం అసంతృప్తి ఫీల్ అయ్యాడట.

నిర్మాణంలో భాగం అయ్యారు కాబట్టి గట్టిగా అడిగే ఛాన్స్ కూడా లేదు. ఈ సినిమా మొదటి నుండి త్రివిక్రం, బన్నిల మధ్య ఏదో డిస్టబన్స్ ఉందని అంటున్నారు. ఈ మ్యాటర్ తో సీన్ అర్ధమైంది. కథ విషయంలో కొన్ని కన్ ఫ్యూజన్స్ ఉండబట్టే బన్ని ఇలా చేస్తున్నాడని అంటున్నారు. ఏది ఏమైనా మొదలు పెట్టిన సినిమా పూర్తి చేయక తప్పదు.

జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తర్వాత హ్యాట్రిక్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా కూడా ఫాదర్, సన్ సెంటిమెంట్ తో వస్తుందట. అలకనంద, నాన్న నేను టైటిల్స్ పరిశీళణలో ఉన్నాయని తెలుస్తుంది. నా పేరు సూర్య ఫ్లాప్ అందుకున్న బన్ని త్రివిక్రం సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

Comments

comments