బ్రేకింగ్ న్యూస్. బిగ్ బాస్ విన్నర్ కౌశల్…

biggboss-winner-kaushal

బిగ్ బాస్ 2 ఇంకో రోజుతో ముగియనుంది. అయితే ఒక రోజు డిలేతో షో టీవీలో ప్రసారం అవుతుంది. అయితే శనివారం రోజే గెలుపు ఎవరిదో తెలిపోనుంది. ప్రస్తుతం అందుతున్న సమచారం మేరకు బిగ్ బాస్ విన్నర్ ఎవరో తేలిపోయింది. రెండు రోజులుగా హౌజ్ లో సరదాగా సాగిపోతుంది. పాత హౌజ్ మేట్స్ షో మొత్తం సరదసరదాగా ఉంది. అయినా ఐదుగురు కంటెస్టెంట్ భయంభయంగానే గడిపారు. అయితే ఎట్టకేళకు గెలిచింది ఎవరన్నది తేలిపోయింది.

అందరు అనుకున్నట్లుగానే షో విన్నర్ కౌశల్ అని తెలుస్తోంది. ఇప్పటికే లీక్ అయిన ఈ సమాచారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ విన్నింగ్ లో కౌశల్ చరిత్ర సృష్టించారు. దాదాపుగా ఇప్పటి వరకు ఏ హౌజ్ మేట్ సాధించనన్న ఓట్లు కౌశల్ సాధించారు. దాదాపుగా 39 కోట్ల 94 లక్షల ఓట్లు కౌశల్ కి వచ్చాయని తెలుస్తోంది. ఒక ఇండివిజువల్ కంటెస్టెంట్ కి ఈ రేంజ్ లో ఓట్లు రావటం ఇదే మొదటి సారి. కౌశల్ ఆర్మీ కోరుకున్నట్లుగా కౌశల్ టైటిల్ తీసుకున్నారు