కౌశల్‌తో గొడవ పడినందుకే.. రోల్ రైడా ఎలిమినేషన్

తెలుగు ర్యాప్ సింగర్ రోల్ రైడా బిగ్‌బాస్ నుంచి నిష్క్రమించడం అభిమానులను షాక్ గురి చేసింది. పెద్దగా ఫ్యాన్ ఫాలోయింగ్ లేకుండా ఇంట్లోకి వెళ్లిన రైడా కొద్ది రోజుల్లోనే భారీ సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకొన్నాడు. అయితే రైడా ఫైనల్ జాబితాలో ఉంటారని అందరూ అనుకొన్నారు. కానీ అనూహ్యంగా బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఆ ఇంటిలోని అనుభవాలను మీడియాకు పంచుకొంటున్నారు. ఇంట్లో జరిగిన టాస్కుల వివరాలు, కౌశల్‌తో జరిగిన గొడవలు తదితర అంశాలను ప్రస్తావించారు.

కౌశల్‌తో మంచి స్నేహం ఉంది. ఒకరంటే మరొకరికి గౌరవం ఉంది అని రోల్ రైడా చెప్పారు. కానీ నా మీద కుక్కల్లా పడుతున్నారంటూ కౌశల్ చేసిన వాఖ్యల నేపథ్యంలో రోల్ రైడా సీరియస్ అయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కన్నీటి పర్యంతమై రోల్ రైడా.. కౌశల్ కాళ్లు పట్టుకోవడం కొంత వివాదానికి దారి తీసింది.

కౌశల్‌తో గొడవ పడినందుకే అవుట్ అయ్యానని అనడం సరికాదు. కౌశల్‌కు నాకు మంచి రిలేషన్ ఉంది. ఇంట్లో ఉన్నప్పుడు అభిప్రాయ బేధాలు లేదా ఫైట్ గానీ లేదు. చిన్న చిన్న అపార్ధాలు ఉంటే సరి చేసుకొన్నాం అని కౌశల్ వెల్లడించాడు.

బిగ్‌బాస్ ఇంటిలో కౌశల్ బలమైన కంటెస్టెంట్. ఆయనతో ఉన్న సాన్నిహిత్యం కారణంగానే ఇంటిలో క్షేమంగా ఉన్నాను. గేమ్‌ను గేమ్‌గా ఆడమని కౌశల్ ఎప్పుడూ చెప్పేవాడు. టాప్ 5గురు ఫైనలిస్టులో ఉండేలా సహాయం చేస్తానని మాట ఇచ్చాడు. మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది అని కౌశల్ అన్నారు.

నేను బిగ్‌బాస్ నుంచి అవుట్ అయిన తర్వాత కౌశల్ బాగా బాధపడ్డాడు. బయటకు వచ్చిన తర్వాత అరుపు షార్ట్ ఫిలింకు మంచి ప్రమోషన్ చేద్దాం అని కౌశల్ అన్నాడు. అలా చెప్పడంతో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అని రోల్ రైడా పేర్కొన్నాడు.

రోల్ రైడా తీరు, ప్రవర్తనపై కౌశల్ ఆర్మీ ఫైర్ అయింది. హౌస్‌లో ఉన్నప్పుడు కౌశల్ అది.. కౌశల్ ఇది అన్నాడు. బయటకు వచ్చాక.. మేమిద్దరం ఫ్రెండ్స్. మా బాండింగ్ జేమ్స్ బాండింగ్ అనేంత రేంజ్‌లో ఫోజు కొడుతున్నాడు. గేమ్‌ను గేమ్‌ లాగా ఆడుంటే టామీ (సామ్రాట్)కు బదులు రోల్ రైడా ఫైనల్‌లో ఉండేవాడు అని కౌశల్ ఆర్మీ ట్వీట్ చేసింది.