అల్లుఅర్జున్-త్రివిక్రమ్ మూవీ బాలీవుడ్ రీమేక్?

alluarjun-trivkram-bollywood-remake

‘అరవింద సమేత’ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ సక్సస్స్ బాటపట్టినా ఇంకా తనలోని రచియితను ఇంకా పూర్తి స్థాయిలో బయటకు తీయలేక పోతున్నాడు అన్న కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. త్రివిక్రమ్ మంచి రచయిత అన్న విషయం ఎవరూ కాదనలేని విషయం. అయితే ‘అ ఆ’ సినిమాకు యద్దనపూడి సులోచనారాణి ‘మీనా’ ప్రేరణ అయితే ‘అజ్ఞాతవాసి’ కి ప్రెంచ్ మూవీ లార్గో వించ్ స్పూర్తిగా నిలిచింది.

ఇక త్రివిక్రమ్ కు అదృష్టాన్ని తెచ్చి పెట్టిన ‘అరవింద సమేత’ లోని మొండికత్తి కానెప్ట్ ను ప్రముఖ కథకుడు వేంపల్లి గంగాథర్ నుంచి తెచ్చుకున్నాడని ఇప్పటికే బయటకు వచ్చింది. దీనితో ఇక లాభం లేదు అనుకుని కాబోలు త్రివిక్రమ్ తన పద్ధతి మార్చుకుని అల్లు అర్జున్ కోసం ఒక మెట్టు దిగి ఏకంగా ఒక బాలీవుడ్ మూవీని తెలుగులో రీమేక్ చేయాలని దృష్టి పెట్టాడు అని వార్తలు వస్తున్నాయి.

తెలుస్తున్న సమాచారం మేరకు త్రివిక్రమ్ అల్లు అర్జున్ కోసం తీయబోతున్న మూవీ ‘సోను కె టిటు కి స్వీటీ’ అనే బాలీవుడ్ మూవీకి రీమేక్ అని తెలుస్తోంది. ఈసినిమాకు కూడ త్రివిక్రమ్ కేవలం ఆమూవీ స్టోరీ లైన్ ను ఆధారంగా తీసుకుని అనేక మార్పులు చేర్పులు చేస్తూ ఉన్నా త్రివిక్రమ్ ఈసారి విమర్శలు రాకుండా అధికారికంగా ఈ విషయాన్ని ముందుగానే ప్రకటించాలి అన్న ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

అదేవిధంగా ఈ సినిమా పక్కా అవుట్ అండ్ అవుట్ ఫన్ మూవీగా తీర్చి దిద్దాలని త్రివిక్రమ్ భావిస్తున్నట్లు టాక్. ఈసినిమాలో హీరోయిన్ పాత్రకు చాల ప్రాధాన్యత ఉన్న నేపధ్యంలో త్రివిక్రమ్ ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ విషయమై హీరోయిన్ రష్మికతో సంభాషణలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.  ఇది ఇలా ఉండగా ‘సోను కె టిటు కి స్వీటీ’ సినిమాను హిందీలో టి సిరీస్ నిర్మించిన నేపధ్యంలో వారికి ఈవిషయం అధికారికంగా తెలియచేసి ఆ సంస్థకు కూడ బన్నీ మూవీలో వాటా ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

News Journalist at Panipuri and Film Reviewer. Indian movies box office tracker.