నాని నిర్మాతగా అల్లు అర్జున్ హీరోగా సినిమా

alluarjun-in-96-movie-remake

విజయ్ సేతుపతి “96”. అక్టోబర్ 4న ఈ చిత్రం విడుదలై హిట్ టాక్ ని సొంతం చేసుకుంది . అంతేకాదు మంచి రివ్యూస్ ని సొంతం చేసుకుంది . రిలీజ్‌కు ముందే సినిమా చూసి దీన్ని రీమేక్ చేయాలని దిల్ రాజు హక్కులు కూడా తీసుకున్నాడు. ఈ విషయం కన్ఫర్మ్ కూడా చేసాడు రాజు. త్వరలోనే “96”ను తెలుగులో రీమేక్ చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు దిల్ రాజు. అయితే ఇందులో ఎవరు నటిస్తారు అనేది మాత్రం చెప్పలేదు ఈ నిర్మాత. నాని ఈ రీమేక్‌లో నటిస్తాడనే వార్తలు కొన్ని రోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం 96 రీమేక్‌తో నానికి సంబంధం ఉంది కానీ హీరోగా మాత్రం కాదని తెలుస్తుంది. ఇప్పటికే స్పెషల్ షో చూసిన నాని.. ఈ సినిమాను తెలుగులో నిర్మించేందుకు ముందుకొచ్చాడని తెలుస్తుంది. అవసరం అనుకుంటే దిల్ రాజుతో కలిసి ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మించడానికి నాని ఆసక్తి చూపిస్తున్నాడని ప్రచారం జరుగుతుంది.

తాజా వార్తల ప్రకారం ఈ తెలుగు రీమేక్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని నటింపజేయాలనే ఆలోచనలో నాని, దిల్ రాజులు ఉన్నారట. అయితే అల్లు అర్జున్ తో మాట్లాడి, తన ఒపీనియన్ తీసుకున్న తర్వాతే దిల్ రాజు ఈ సినిమా పై ప్రకటన చేయనున్నారు