అల్లు అర్జున్ ని ఎద్దేవా చేసిన జనసేన

సోషల్ మీడియా ద్వారా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా రవిని గెలిపించాలంటూ అల్లు అర్జున్ పిలుపునిచ్చారు. ఆ మేరకు ఒక పోస్టుపెట్టాడు. శిల్పా రవి తనకు స్నేహితుడని అతడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నందుకు అభినందనలు అని ఆయనను గెలిపించాలని అంటూ అల్లు అర్జున్ పోస్టు పెట్టాడు. అది బాగా చర్చనీయాంశం అయ్యింది. మెగా ఫ్యామిలీల్లో హీరోల్లో ఒకరిగా పేరున్న అల్లు అర్జున్ ఇలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని అనడం సర్వత్రా చర్చనీయాంశంగా నిలిచింది. ఇది నంద్యాల్లో పోటీలో ఉన్న జనసేన అభ్యర్థికి ఇబ్బందికరమైన అంశం అవుతోంది. ఈ నేపథ్యంలో సదరు అభ్యర్థి స్పందించారు. నంద్యాల నుంచి జనసేన తరఫున ఎస్పీవై రెడ్డి అల్లుడు శ్రీధర్ రెడ్డి పోటీలో ఉన్న సంగతి తెలిసిందే.

అల్లు అర్జున్ పోస్టు మీద శ్రీధర్ రెడ్డి స్పందిస్తూ.. ఎద్దేవా చేశారు. నంద్యాల నియోజకవర్గంలో అల్లు అర్జున్ ప్రభావం ఏముంటుందని? ఆయన ఏమీ ఆ నియోజకవర్గం ఓటర్ కాదు ఆ ప్రాంతం వ్యక్తి కాదు.. అలాంటి వారి ప్రభావం ఏమీ ఉండదన్నట్టుగా శ్రీధర్ రెడ్డి స్పందించారు. అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా శిల్పా రవికి మద్దతు పలకడం వెనుక వేరే కథ ఉందని అల్లు అర్జున్ భార్య శిల్పా రవి భార్యలు కలిసి పార్టీలకు వెళ్తారని అలా వారి మధ్య స్నేహం ఉందని ఆ స్నేహంతోనే ఇప్పుడు అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా శిల్పా రవికి మద్దతు పలికారని శ్రీధర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు

Comments

comments