వైఎస్సార్ కాంగ్రెస్ చేస్తున్న బోగస్ ఓట్ల పై విచారణ

ysrcp bogus votes enquiry

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలే ఢిల్లీ వెళ్లి రాష్ట్రంలో దాదాపుగా 60 లక్షల దొంగ ఓట్లను టీడీపీ ప్రభుత్వం చేర్చిందని ఆరోపిస్తూ ఒక లిస్టు కూడా ఇచ్చారు. ఇప్పుడు దానిపై కేంద్ర ఎన్నికల కమిషన్ విచారణకు ఆదేశించినట్టు సమాచారం. విచారణ 15 రోజుల్లో పూర్తవుతుందని తెలుస్తుంది. దీనితో వైఎస్సార్ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలలో ఎంత వరకు నిజం ఉంది అనేది తొందర్లోనే తేలిపోతుంది.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితా నుంచి అక్రమంగా ఓట్ల తొలగింపు, అవకతవకలపై వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం మధ్యాహ్నం రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. పోలీస్ అధికారుల నియామకాల్లోనూ అధికార దుర్వినియోగంపై వైఎస్ జగన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికలు సజావుగా జరగాలంటే డీజీపీ ఠాకుర్, ఇంటెలిజెన్స్‌ ఐజీ వెంకటేశ్వరరావు, డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్‌రావును వెంటనే బదిలీ చేయాలని ఆయన గవర్నర్ ను కోరారు.

Comments

comments