అబ్బో స్పీకర్ మీద ఉన్నఫళంగా ఇంత ప్రేమా?

శుక్రవారం విభజన హామీల అమలుపై లఘు చర్చ జరుగుతున్న సందర్భంలో 13 నిమిషాల పాటు స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు రెస్ట్‌ రూములోకి వెళ్ళారు. ఆ సమయంలో సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే తలారి ఆదిత్య స్పీకర్‌ స్థానాన్ని అధిష్టించి సభను నడిపించారు. ఆయన కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నల్లచొక్కా, నల్ల ప్యాంటు వేసుకొని శాసనసభకు వచ్చారు. పూర్తిగా నల్ల దుస్తులతో స్పీకర్‌ స్థానంలో కూర్చోవడంతో స్పీకర్ సీటుకి అవమానం జరిగిందని సాక్షి ఒక ఐటమ్ రాసింది.

ఇక్కడ గమ్మత్తయిన విషయం ఏంటంటే దాదాపుగా రెండేళ్ల నుండి ప్రతిపక్ష వైఎస్సాఆర్ కాంగ్రెస్ శాసనసభను బహిష్కరిస్తుంది. దాదాపుగా రోజు ఆ పార్టీ నాయకులు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సహా స్పీకర్ ను తూలనాడుతూ ఉంటారు. స్పీకర్ పదవిలో ఉన్న కోడెల శివప్రసాద రావుకు ఏనాడు మర్యాద అనేది ఇవ్వలేదు వైఎస్సాఆర్ కాంగ్రెస్. ఇప్పుడు ఆ పార్టీ మీడియా సాక్షి ఉన్నఫళంగా మర్యాదలు గుర్తుకు వచ్చాయి. స్పీకర్ స్థానంలో ఉండి రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై నిరసన తెలపకూడదా?

Comments

comments