ఎట్టకేలకు బ్రేక్ తీసుకున్న జగన్ మోహన్ రెడ్డి

ఎట్టకేలకు బ్రేక్ తీసుకున్న జగన్ మోహన్ రెడ్డి

వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎడతెరపి లేని బిజీ షెడ్యూల్ మధ్య ఉన్నారు. ఎన్నికలకు రెండున్నర నెలల లోపే ఉండటంతో ఆయన సుదీర్ఘ పాదయాత్ర తరువాత కూడా రెస్టు తీసుకోకుండా పార్టీ పనులలో బిజీగా ఉంటున్నారు. టీడీపీ నుండి నాయకులను బయటకు లాగి మానసికంగా ఆ పార్టీని దెబ్బ తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఒక వారం హాలిడే తీసుకుంటున్నారు జగన్. భార్య భారతి తో కలిసి లండన్‌ బయలుదేరారు.

తెల్లవారుజామున నాలుగు గంటలకు బ్రిటన్ ఎయిర్ వేస్‌ విమానంలో వెళ్లిన జగన్‌ దంపతులు దాదాపు వారం రోజులపాటు ఆ దేశంలో పర్యటిస్తారు. లండన్‌ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో చదువుతున్న కుమార్తె వర్ష రెడ్డిను చూసేందుకు వారు లండన్‌ వెళ్లారు. తిరిగి ఈ నెల 26వ తేదీన జగన్‌ దంపతలు హైదరాబాద్‌ చేరుకుంటారు. నిజానికి జగన్ గత నెలలోనే లండన్ వెళ్లాల్సి ఉన్నాచివరి నిముషంలో ఆయన పర్యటన వాయిదా పడింది. జగన్ తిరిగి వచ్చాకా అమరావతిలో ఆయన కొత్త ఇంట్లోకి వెళ్తారు.

Comments

comments