వైఎస్సార్ కాంగ్రెస్ అమరావతి కార్యాలయంలో మొదటి చేరికలు

వైఎస్సార్ కాంగ్రెస్ అమరావతి కార్యాలయంలో మొదటి చేరికలు

వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు ఉదయం గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మించుకున్న కొత్త ఇంటిలోకి గృహప్రవేశం చేశారు. అనంతరం పార్టీ కొత్త కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. ఇది జరిగిన కొద్ది గంటలకే వైఎస్సార్ కాంగ్రెస్ లో కొత్త చేరికలు జరిగిపోయాయి. ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌, దగ్గుబాటి వెంకటేశ్వరరావు తనయుడు హితేశ్‌ చెంచురామ్‌ ఆ పార్టీలో చేరారు. పార్టీ కార్యాలయంలో కండువా కప్పి జగన్‌ వారిని పార్టీలోకి ఆహ్వానించారు

రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు, వైఎస్సార్‌ అభిమానులు తరలి రావడంతో పార్టీ కార్యాలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఆ ప్రాంగణమంతా ‘జోహార్‌ వైఎస్సార్‌.. జై జగన్‌’ అనే నినాదాలతో మార్మోగుతోంది. ఎన్నికల వరకు జగన్ ఇక్కడ నుండే తన పార్టీ కార్యకలాపాలు నిర్వహించబోతున్నారు. గతంలో హైదరాబాద్ లోని తన లోటస్ పాండ్ ఇంటి నుండే పని చేసిన జగన్ ఎన్నికల ముందు అమరావతి ప్రజలను ఆకట్టుకోవడానికి ఆంధ్రకు తరలి వచ్చారు.

Comments

comments