పవన్ కళ్యాణ్ మాటలు జనం నమ్ముతారా?

Pawan New Age Politics-gave four tickets to one family

పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ మొదటి సారిగా ఈ ఎన్నికలలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. వామపక్షాలు, బీస్పీతో కలిసి ఈ ఎన్నికలలో పోటీ చేస్తుంది. అయితే గతంలో ప్రజారాజ్యం పెట్టి ఆ తరువాత ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చెయ్యడమే జనసేన పాలిట శాపంగా మారింది. నేను చిరంజీవి లా కాదు అని చెప్పి ప్రజలను కన్విన్స్ చెయ్యడంలోనే పవన్ కళ్యాణ్ సక్సెస్ ఆధారపడి ఉంది. ఈ క్రమంలో ఆయన ఎన్నికల ప్రచారం ఈ విషయాన్నీ పదే పదే చెబుతున్నారు.

ప‌దేళ్లు రాజ‌కీయాలు చేయడానికి రాలేదు… ప్రాణం పోయేంత వ‌ర‌కు ప్ర‌జ‌ల్లో ఉండాల‌ని వ‌చ్చాన‌ని ఆయన చెప్పుకొచ్చారు. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఎంత కాలం పార్టీని మోస్తాడు అంటున్నారు. నవుడూరు జంక్ష‌న్నుంచి చెబుతున్నా… న‌న్ను న‌లుగురు కాటికి మోసుకెళ్లే వ‌ర‌కు నేను జ‌న‌సేన
పార్టీని మోస్తాన‌న్నారు. నా అంతిమశ్వాస వ‌ర‌కు జ‌న‌సేన‌ని మోస్తాన‌ని తెలిపారు. పవన్ కళ్యాణ్ మాటలు జనం నమ్ముతారా? అనేది తెలియాలంటే ఈ మే 23 వరకు ఆగాల్సిందే.

Comments

comments