ఎన్టీఆర్ వైఎస్సార్ కాంగ్రెస్ కోసం ప్రచారం చేస్తారా?

కొద్ది రోజులలో ఎన్నికల షెడ్యూల్ రానుండడంతో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వేడి రాజుకుంటుంది. ఈరోజు అమలాపురం టీడీపీ ఎంపీ పండుల రవీంద్ర బాబు ఈ ఉదయం జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో టీడీపీ నుండి వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరిన సంఖ్య రెండుకు చేరింది. ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా పార్టీలో చేరారు. ఇదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్‌ మామ నార్నె శ్రీనివాసరావు లోటస్‌పాండ్‌కు వెళ్లి జగన్‌ను కలవడం ఆసక్తికరంగా మారింది.

ఎందుకు కలిశారని మీడియా ఆయనను ప్రశ్నించగా.. జగన్‌ను మర్యాద పూర్వకంగానే కలిశానని నార్నె శ్రీనివాసరావు బదులిచ్చారు. 2014 ఎన్నికల ముందు కూడా ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ వార్తల వల్ల జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి రానుంది. ఇటీవలే కాలంలో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటున్నారు. హరికృష్ణ కుమార్తె సుహాసిని కూకట్ పల్లినుండి పోటీ చేసినా ప్రచారానికి వెళ్ళకపోవడం తెలిసిందే. ఇప్పుడు మామ కోసం ఎన్టీఆర్ వైఎస్సార్ కాంగ్రెస్ కోసం ప్రచారం చేస్తారా?

Comments

comments